AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి అంటూ భార్యకు సూచనలు చేస్తూ…

కుటుంబ కలహాలు విషాదాంతానికి దారి తీశాయి. రాజంపేటలో భార్య ఉరివేసుకుంటుండగా అక్కడే ఉన్న భర్త ఆపకపోగా ఎలా ఉరి వేసుకోవాలో సూచిస్తూ వీడియో తీయడం కలకలం రేపుతోంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా, భర్తను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. .. ..

Andhra: ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి అంటూ భార్యకు సూచనలు చేస్తూ...
Sriram Krishnaveni
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Mar 13, 2026 | 8:26 AM

Share

భార్యాభర్తల మధ్య గొడవలు అనేక కుటుంబాలలో కన్నీరుని మిగిల్చాయి. గొడవ జరిగిన తర్వాత ఆగ్రహావేశాలకు లోనై ఉరివేసుకొని అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.. అలాంటిదే ఇప్పుడు  కడప జిల్లా రాజంపేటలో కూడా జరిగింది.. అయితే భార్య ఉరివేసుకుంటుంటే భర్త అక్కడే ఉన్నా కనీసం కాపాడకపోగా ఉరి ఎలా వేసుకోవాలో తనకు వివరించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లి గ్రామంలో రైల్వే లోకో పైలట్‌గా పనిచేస్తున్న శ్రీరామ్ శ్రీనివాస్- అతని భార్య కృష్ణవేణి గురువారం కుటుంబ కలహాల వలన గొడవ పడ్డట్టు సమాచారం.. అయితే ఈ గొడవలు వీరికి నిత్యమేనని స్థానికులు చెప్తున్నారు .. ప్రతిరోజు గొడవపడటం తర్వాత మామూలుగా ఉండటం సర్వసాధారణమే అనుకున్నారు స్థానికులు కూడా… అయితే ఈసారి విధి వికటించింది. ఉరి వేసుకుంటానని భర్తతో గొడవ పడిన భార్య కృష్ణవేణి ఈసారి నిజంగానే ఉరి వేసుకుంది. అయితే ఆ ఉరి వేసుకునే సమయంలో భర్త శ్రీరామ్ శ్రీనివాస్ కూడా అక్కడే ఉన్నాడు. భార్య ఉరి వేసుకుంటుంటే కనీసం ఆమెను ఆపకపోగా.. ఉరి అలా కాదు ఇలా వేసుకోవాలి అంటూ తనకు సూచనలు చేస్తూ వీడియో రికార్డు చేశాడు. సరాదాగా భావించి తన భార్యను కాపాడుకోలేకపోయాడా లేక కావాలని ఆమెను ఉరిని ప్రేరేపించాడా అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.. కృష్ణవేణి మృతిపై ఆమె బంధువులు ఆగ్రహావేశాలకు లోనై శ్రీరామ్‌పై దాడికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.. అయితే కృష్ణవేణి మృతికి ఆమె భర్తే కారణమని అతని శిక్షించాలని వారు పట్టుబడ్డారు. దీంతో పోలీసులు ఇతనిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉరి వేసుకుంటుంటే కనీసం ఆపకపోగా చిత్రీకరించిన భర్త శ్రీరామ్ శ్రీనివాసులపై స్థానికులు మండిపడుతున్నారు.

Also Read: కరివేపాకు చెట్టుకు ఇది వేశారంటే.. సూపర్‌గా పెరుగుతుంది.. 

Follow Us
ఉరి ఎలా వేసుకోవాలో భార్యకు చెప్తూ వీడియో రికార్డు చేశాడు..
ఉరి ఎలా వేసుకోవాలో భార్యకు చెప్తూ వీడియో రికార్డు చేశాడు..
గరుడపురాణం రహస్యాలు.. అంతిమ సంస్కారాలు కూతుళ్లు చేస్తే ఏమవుతుంది?
గరుడపురాణం రహస్యాలు.. అంతిమ సంస్కారాలు కూతుళ్లు చేస్తే ఏమవుతుంది?
2026 ఉగాది రాశిఫలాలు.. కుంభ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ..
2026 ఉగాది రాశిఫలాలు.. కుంభ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ..
డగౌట్‌లో గంభీర్ అసలెందుకు నవ్వడు.. అసలు రీజన్ ఇదే..?
డగౌట్‌లో గంభీర్ అసలెందుకు నవ్వడు.. అసలు రీజన్ ఇదే..?
వలం రూ.49,999లకే TVS కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్‌ 86 కి.మీ..
వలం రూ.49,999లకే TVS కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్‌ 86 కి.మీ..
7/జి బృందావన్‌ కాలనీ సీక్వెల్ హీరోయిన్ ఈ అమ్మడేనట
7/జి బృందావన్‌ కాలనీ సీక్వెల్ హీరోయిన్ ఈ అమ్మడేనట
సరదాగా వాకింగ్ చేద్దామని రాత్రి చెరువు కట్టవైపు వెళ్లారు.. తీరా
సరదాగా వాకింగ్ చేద్దామని రాత్రి చెరువు కట్టవైపు వెళ్లారు.. తీరా
జాబ్ అలర్ట్.. పోలీసు శాఖలో 17,992 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు
జాబ్ అలర్ట్.. పోలీసు శాఖలో 17,992 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు
ఎండు చేపలు పకోడీ ఇలా చేస్తే.. ప్లేట్లు లాగిస్తూనే ఉంటారు
ఎండు చేపలు పకోడీ ఇలా చేస్తే.. ప్లేట్లు లాగిస్తూనే ఉంటారు
ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ ఫోన్‌కాల్‌..!
ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ ఫోన్‌కాల్‌..!