తెలుగు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడాలో 15 ఏళ్ళ అనుభవం ఉంది . ప్రజాశక్తి విలేకరిగా కెరయర్ ప్రారంభం అయింది .. 2012 లో 10టివి స్టాఫ్ రిపోర్టర్ గా ఎలక్ట్రానిక్ మీడియా కెరియర్ ప్రారంభం . 2016 లో HMTV , 2017లో TV5, 2019 లో AP24X7 లో పనిచేసి 2021 లో TV9 లో అడుగుపెట్టాను .. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లా ప్రతినిధిగా భాద్యతలు నిర్వహిస్తున్నాను.
Andhra Pradesh: నాన్న నాటిన జ్ఞాపకం.. చెట్టు కోసం ఏకంగా ఇంటి ప్లాన్‌నే మార్చేసిన కొడుకులు
నాన్నంటే ఒక జ్ఞాపకం కాదు.. నిత్యం మనతోనే ఉండే ఒక ప్రాణం.. కొత్త ఇంటి నిర్మాణానికి అడ్డు వచ్చిందని చాలామంది చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికేస్తుంటారు. కానీ ఈ కొడుకులు మాత్రం తండ్రి నాటిన చెట్టు కోసం ఏకంగా ఇంటి ప్లాన్‌నే మార్చేశారు. కడప జిల్లాలో తండ్రి జ్ఞాపకాన్ని కాపాడుకున్న ఆ కొడుకుల కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
- Sudhir Chappidi
- Updated on: Sep 27, 2026
- 7:05 pm
Andhra: ఏకంగా ఆరు ఉద్యోగాలు ఒడిసిపట్టిన పులివెందుల ఆడబిడ్డ..
నేటి పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనమైపోతోంది. అలాంటిది ఓ సాధారణ మధ్యతరగతి యువతి ఏకంగా ఆరు కేంద్ర ప్రభుత్వ కొలువులను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలి ప్రయత్నంలో ఎదురైన పరాజయానికి కుంగిపోకుండా, పట్టుదలతో శ్రమించి లక్ష్యాన్ని ముద్దాడిన వైఎస్సార్ కడప జిల్లా పులివెందులకు చెందిన చిదిగే సాయి వర్షిత విజయ ప్రస్థానం నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
- Sudhir Chappidi
- Updated on: Sep 22, 2026
- 5:16 pm
వినాయకుడికి ఆధార్ .. మండపం వద్ద సెల్ఫీలతో యువకులు
పేరు: గణేష్, తండ్రి పేరు : శివుడు,చిరునామా : మదర్ థెరిసవీధి, నాగిరెడ్డి పల్లి, నందలూరు(మం ), కడప జిల్లాసాధారణంగా మనుషులకు ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఉంటాయి. అయితే నందలూరు యువత తమ మీధోశక్తిని ఉపయోగించి ఏకంగా ఘనపయ్యకే ఆధార్ కార్డు పాన్ కార్డును క్రియేట్ చేశారు. గణనాధునికి తమ ఊరి అడ్రస్ ఇచ్చి వారు సొంతం చేసుకున్నారు.
- Sudhir Chappidi
- Updated on: Sep 16, 2026
- 1:16 pm
Andhra Pradesh: నేటికి 124 ఏళ్లు.. దేశంలోనే తొలి రైలు ప్రమాదం ఏపీలో ఎక్కడ జరిగిందో తెలుసా..?
సరిగ్గా 124 ఏళ్ల క్రితం.. చీకటి రాత్రిలో విరుచుకుపడిన పెను వరద భారత రైల్వే చరిత్రలోనే తొలి నెత్తుటి మరకను మిగిల్చింది. కడప జిల్లా మంగపట్నం వద్ద వంతెన కూలి మెయిల్ రైలు జలసమాధి అయిన ఆ ఘోర దుర్ఘటనలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. శతాబ్ద కాలం దాటినా నాటి రైలు ప్రమాద ఆనవాళ్లు, థెరిసా లీమా సేవా పథం నేటి తరానికి గతాన్ని గుర్తుచేస్తూ.. మంగపట్నం గ్రామాన్ని చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిపాయి.
- Sudhir Chappidi
- Updated on: Sep 12, 2026
- 6:51 pm
ఘాట్ రోడ్డులో దడ పుట్టిస్తున్న చిరుత.. భయాందోళనలో వాహనదారులు..!
కడప జిల్లాలోని చిట్వేలు-రాపూరు ఘాట్ రోడ్డులో చిరుతపులి సంచారం వాహనదారులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. రాత్రి వేళల్లో రోడ్డుపై మళ్ళీ మళ్ళీ చిరుత ప్రత్యక్షమవడంతో ప్రయాణికులు జంకుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ తక్షణమే స్పందించి పెట్రోలింగ్ పెంచాలని, తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
- Sudhir Chappidi
- Updated on: Sep 8, 2026
- 9:59 pm
పసిడిపురి.. తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ధరకు బంగారం ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలుకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాల్లో ప్రొద్దుటూరుకు ప్రత్యేక స్థానం ఉంది. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలతో పోలిస్తే ఇక్కడ బంగారం ధర, తరుగు, మేకింగ్ ఛార్జీల్లో వ్యత్యాసం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. భారీ మొత్తంలో ఆభరణాలు కొనుగోలు చేసేవారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రొద్దుటూరుకు వస్తుంటారు.
- Sudhir Chappidi
- Updated on: Sep 8, 2026
- 4:12 pm
బ్రేకులు ఫెయిల్.. లోయలోకి దూసుకెళ్లిన లారీ! రెప్పపాటులో ఇద్దరు సజీవ దహనం..
గువ్వలచెరువు ఘాట్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాయచోటి నుంచి కడపకు వస్తున్న సిమెంట్ లారీ లోయలోకి దూసుకెళ్లి మంటలు చెలరేగడంతో డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ సజీవ దహనమయ్యారు. ఘాట్‌లో సరైన ప్రమాద సూచికలు, మలుపుల హెచ్చరిక బోర్డులు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..
- Sudhir Chappidi
- Updated on: Sep 8, 2026
- 8:16 am
నీటిని నమ్ముకునే కంటే సూర్యుడిని నమ్మడం బెస్ట్ అంటున్న అక్కడి రైతులు
రాష్ట్రవ్యాప్తంగా ఎల్ నీనో ప్రభావంతో రైతులంతా క్రాప్ హాలిడే ప్రకటిస్తుంటే రాయలసీమలోని జమ్మలమడుగు నియోజకవర్గ రైతులు మాత్రం వినూత్నంగా ఆలోచించి నీటిని నమ్ముకునే కన్నా సూర్యుని నమ్ముకుంటే మేలని వారి భూములను సోలార్ విద్యుత్ సంస్థలకు లీజుకు ఇస్తున్నారు ఇప్పటికే నియోజకవర్గంలోని సగం మంది రైతులు ఇదే బాట పట్టారు.
- Sudhir Chappidi
- Updated on: Sep 7, 2026
- 6:33 pm
తండ్రిని పట్టించుకోని కొడుకులకు కోర్టు షాక్.. అదిరిపోయే తీర్పు ఇదే!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే కుమారులకు కోర్టు గుణపాఠం చెప్పింది. కడప జిల్లాకు చెందిన 88 ఏళ్ల వృద్ధుడు తన ఆస్తిని కొడుకులకు రాసివ్వగా, వారు పట్టించుకోలేదు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించగా, కుమారుల పేరిట ఉన్న ఆస్తి హక్కులను రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. సీనియర్ సిటిజన్ల ఆస్తి హక్కుల పరిరక్షణకు ఇది ఒక మంచి ఉదాహరణ.
- Sudhir Chappidi
- Updated on: Sep 2, 2026
- 6:06 pm
Andhra: కరువు నేలలో ‘కాస్ట్లీ’ పంట.. రైతు సక్సెస్‌ఫుల్ ప్రయోగం!
కరువు ప్రాంతంగా పేరున్న పులివెందులలో ఓ రైతు వినూత్న ప్రయోగంతో సత్తా చాటారు. 39 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య డ్రిప్ ఇరిగేషన్‌తో అవకాడో పంటను సాగు చేసి తొలి దిగుబడిలోనే నాలుగు టన్నుల పంటను పండించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ రైతు ప్రయోగాన్ని ప్రశంసించడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.
- Sudhir Chappidi
- Updated on: Sep 1, 2026
- 3:39 pm
ఐదునదుల సంగమం .. దక్షిణ కాశీ పుష్పగిరి విశిష్టత ఇదే
దక్షిణ కాశీగా పిలవబడే పుష్పగిరి పుణ్యక్షేత్రం విశిష్టత ఎంతో అమోఘమైనది .. ఇక్కడ శైవులు వైష్ణవులు ఇద్దరూ కలిసి పూజించే ఏకైక దేవాలయం పుష్పగిరి పుణ్యక్షేత్రం. ఇక్కడ పెద్దలకు పిండ ప్రదానం చేస్తే ఎంతో పుణ్యం , అంతేకాక కాశీకి వెళ్లి పిండ ప్రదానం చేసినంత పుణ్యం ఇక్కడ వస్తుందని నమ్మకం అందుకే దీనిని దక్షిణ కాశీగా పిలుస్తారు.
- Sudhir Chappidi
- Updated on: Aug 26, 2026
- 5:02 pm
స్కూల్‌లో ఉపాధ్యాయురాలి వింత ప్రవర్తణ.. విద్యార్థులు పేరెంట్స్ ఏం చేశారంటే?
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు వారిపై దుర్భాషలాడుతూ, అసభ్యంగా ప్రవర్తిస్తుండటం స్టార్ట్ చేసింది. ఈ విషయం తెలిసిన విద్యార్థుల పేరెంట్స్.. ఇదేంటని ప్రశ్నించడానికి వస్తే వారిపై కూడా దాడికి ప్రయత్నించింది. దీంతో విసిగిపోయిన తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి నిరసనకు దిగిన ఘటన కడప జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
- Sudhir Chappidi
- Updated on: Aug 25, 2026
- 8:34 pm