AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళల్లోనూ 'సైలెంట్ కిల్లర్ గా మారుతున్న  గుండె సమస్య.. WHO విస్తుపోయే నిజాలు!

మహిళల్లోనూ ‘సైలెంట్ కిల్లర్ గా మారుతున్న గుండె సమస్య.. WHO విస్తుపోయే నిజాలు!

Phani CH
|

Updated on: Mar 10, 2026 | 11:07 AM

Share

మహిళల్లో గుండె జబ్బులు, ముఖ్యంగా ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్, ప్రాణాంతకంగా మారుతున్నాయి. ధమనులలో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త సరఫరా తగ్గి గుండెపోటుకు దారితీస్తుంది. పురుషుల కన్నా మహిళల్లో లక్షణాలు భిన్నంగా (అలసట, ఊపిరి ఆడకపోవడం) ఉంటాయి. మెనోపాజ్ తర్వాత ఈ ముప్పు పెరుగుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, సకాలంలో వైద్య సలహా ద్వారా గుండెను కాపాడుకోవచ్చు.

గుండెపోటు అనగానే అది కేవలం పురుషులకే వస్తుందనేది ఒకనాటి మాట. కానీ ప్రస్తుత మారుతున్న జీవనశైలిలో మహిళల ప్రాణాలకు కూడా గుండె జబ్బులు పెనుముప్పుగా మారుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం, భారతదేశంలో కొవిడ్ తర్వాత మహిళల మరణాలకు ‘ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్’ రెండో ప్రధాన కారణమని తేలింది. 2021లో ప్రతి లక్ష మందిలో దాదాపు 100 మంది ఈ వ్యాధి వల్లే ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఏంటీ ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్? అంటే.. దీనినే ‘కరోనరీ హార్ట్ డిసీజ్’ అని కూడా అంటారు. గుండెకు రక్తాన్ని చేరవేసే ధమనుల గోడలలో కొవ్వు పదార్థం పేరుకుపోవడం వల్ల ఈ సమస్య మొదలవుతుంది. దీనివల్ల రక్తనాళాలు సన్నబడి, గుండెకు అందాల్సిన ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. ఆ కొవ్వు పొర పగిలి రక్తం గడ్డకడితే అది నేరుగా ‘హార్ట్ ఎటాక్’కు దారితీస్తుంది. అయితే మహిళల్లో ఈ వ్యాధి లక్షణాలు భిన్నంగా ఉంటాయి. అందుకే అప్రమత్తత చాలా అవసరం. సినిమాల్లో చూపించినట్లు ఛాతీలో తీవ్రమైన నొప్పి అందరు మహిళల్లోనూ కనిపించకపోవచ్చు. అందుకే చాలామంది వీటిని సాధారణ అలసట లేదా గ్యాస్ సమస్యగా భావించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా గమనించాల్సిన లక్షణాలు ఏమిటంటే.. విపరీతమైన అలసట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది. వాంతులు .. కడుపులో వికారం, దవడ, మెడ వీపు భాగంలో నొప్పి, ఛాతీలో అసౌకర్యం భారంగా అనిపించడం. ఈ లక్షణాలను అశ్రద్ధ చేయకూడదు. మహిళల్లో ‘మెనోపాజ్’ తర్వాత గుండె జబ్బుల ముప్పు అకస్మాత్తుగా పెరుగుతుంది. రక్తనాళాలను రక్షించే ‘ఈస్ట్రోజెన్’ హార్మోన్ స్థాయిలు తగ్గడమే దీనికి ప్రధాన కారణం. దీనికి తోడు అధిక రక్తపోటు , డయాబెటిస్, ఊబకాయం మరియు శారీరక శ్రమ లేకపోవడం పరిస్థితిని మరింత దిగజారుస్తాయి. పొగతాగే అలవాటు ఉన్న మహిళల్లో రక్తనాళాలు చాలా త్వరగా దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం, బరువు నియంత్రణ ద్వారా గుండెను కాపాడుకోవచ్చు. సమస్య తీవ్రతను బట్టి యాంజియోప్లాస్టీ లేదా బైపాస్ సర్జరీ వంటి ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. చిన్నపాటి లక్షణం కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐస్‌క్రీం తినగానే నీళ్లు తాగుతున్నారా ?? అయితే ఈ సమస్యలు తప్పవు

Viral Video: కారులో కోబ్రా.. షాక్‌లో యజమాని

వీడసలు భర్తేనా.. కట్టుకున్న భార్యను ఎరగా వేసి.. కుర్రాడిని..

టీటీడీ కొనుగోళ్లలో ఏఐ విప్లవం.. డిజిటల్ పోర్టల్‌తో అక్రమాలకు చెక్

అసాంఘిక శక్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న టీమ్ ‘రుద్రమ’

Follow Us