AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసాంఘిక శక్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న టీమ్ ‘రుద్రమ’

అసాంఘిక శక్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న టీమ్ ‘రుద్రమ’

Phani CH
|

Updated on: Mar 10, 2026 | 9:56 AM

Share

వరంగల్‌కు చెందిన "టీమ్ రుద్రమ" రాష్ట్రంలోనే మొదటి మహిళా ప్రత్యేక పోలీస్ ఫోర్స్‌గా నిలుస్తోంది. ఏకే-47 ఆపరేషన్, మార్షల్ ఆర్ట్స్, కూంబింగ్ వంటి కఠిన శిక్షణతో వీరు పురుషులకు ఏమాత్రం తీసిపోవడం లేదు. సంప్రదాయ విధులకే పరిమితం కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్న ఈ మహిళా కమాండోలు ప్రతి మహిళకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

సామాన్యంగా మహిళా పోలీసులు అంటే స్టేషన్ విధులు, రిసెప్షన్ లేదా మహిళా ఖైదీల అరెస్టులకే పరిమితమని భావిస్తారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. జంగిల్ డ్రెస్ ధరించి, చేతిలో ఏకే-47 పట్టి, అసాంఘిక శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు వరంగల్ కమిషనరేట్‌కు చెందిన “టీమ్ రుద్రమ” మహిళా కమాండోలు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ ‘ఉమెన్స్ స్పెషల్ పోలీస్ ఫోర్స్’ ఇప్పుడు పోలీసు శాఖకే గర్వకారణంగా మారింది. ఈ టీమ్ ప్రత్యేకత వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. వీరు కళ్ళకు గంతలు కట్టుకుని కేవలం 40 సెకన్లలో తుపాకీ భాగాలను విడదీసి, తిరిగి అమర్చగల నైపుణ్యం వీరి సొంతం. మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్‌తో పాటు ఏకే-47, ఎస్ఎల్ఆర్ వంటి భారీ ఆయుధాలను ప్రయోగించడంలో వీరు ఆరితేరారు. గ్రేహౌండ్స్, ఎస్పీజీ తరహాలో వీరికి కఠినమైన శిక్షణ ఇచ్చారు. శిక్షణలో భాగంగా అడవుల్లో కూంబింగ్ చేయడం, రహస్య స్థావరాలపై మెరుపు దాడులు చేయడం. 10 కిలోమీటర్ల రన్నింగ్, రోప్ క్లైంబింగ్ మరియు యుద్ధ సమయంలో గాయపడిన తోటి సిబ్బందిని భుజాలపై మోసుకెళ్లడంలో తర్ఫీదునిచ్చారు. ఏఆర్ విభాగంలో శిక్షణ పూర్తి చేసుకున్న 40 మందిలో అత్యంత చురుగ్గా ఉన్న 21 మందిని ఎంపిక చేసి ఈ టీమ్‌ను రూపొందించారు. వీరిలో ఎమ్మెస్సీ, ఎంసీఏ వంటి ఉన్నత చదువులు చదివిన వారితో పాటు రాష్ట్ర స్థాయి క్రీడాకారులు కూడా ఉన్నారు. బాంబులను నిర్వీర్యం చేయడం, మ్యాప్ రీడింగ్ మరియు నావిగేషన్‌లోనూ నైపుణ్యం సంపాదించారు. ఈ సందర్భంగా టీమ్‌ రుద్రమ స్పందిస్తూ.. మొదట్లో భారీ తుపాకులు పట్టుకోవాలంటే భయపడేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎలాంటి వెపన్ ఇచ్చినా ఆపరేట్ చేయగలమనే ధీమా వచ్చింది అని టీమ్ రుద్రమ సభ్యులు గర్వంగా చెబుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పురుషులకు ఏమాత్రం తీసిపోమని వీరు నిరూపిస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, బందోబస్తులే కాకుండా ఏ అత్యవసర పరిస్థితుల్లోనైనా రంగంలోకి దిగేందుకు ఈ మహిళా సైన్యం సిద్ధంగా ఉంది. మహిళా దినోత్సవం వేళ, అబలలు కాదు మేము సబలలమని చాటుతున్న “టీమ్ రుద్రమ” సాహసాలు ప్రతి మహిళకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విధి ఆడిన వింత నాటకం.. భర్తను బలిగొన్న కరెంటు తీగ

Follow Us