AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడసలు భర్తేనా.. కట్టుకున్న భార్యను ఎరగా వేసి.. కుర్రాడిని..

వీడసలు భర్తేనా.. కట్టుకున్న భార్యను ఎరగా వేసి.. కుర్రాడిని..

Phani CH
|

Updated on: Mar 10, 2026 | 10:53 AM

Share

విజయనగరం జిల్లాలో సోషల్ మీడియా హనీట్రాప్ ఘటన వెలుగుచూసింది. అందమైన మాటలతో భీమిలి యువకుడిని ట్రాప్ చేసి, దంపతులు దోచుకున్నారు. ఫిబ్రవరి 14న రప్పించి, బంగారు గొలుసు, డబ్బు డిమాండ్ చేశారు. పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారు. అపరిచితులను నమ్మి మోసపోవద్దని అదనపు ఎస్పీ హెచ్చరించారు. ఆన్‌లైన్ పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

సోషల్ మీడియా పరిచయాలు ఒక్కోసారి ప్రాణసంకటంగా మారుతాయని నిరూపించే ఘటన విజయనగరం జిల్లాలో వెలుగుచూసింది. అందమైన మాటలతో హనీ ట్రాప్ చేసి, ఒక యువకుడిని దోచుకున్న దంపతుల గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనతో సోషల్ మీడియాలో అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విశాఖ జిల్లాకు చెందిన పాండ్రంకి కిరణ్, ఉష దంపతులు సోషల్ మీడియాను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. వీళ్లు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. అయితే.. అందులో తగినంత ఆదాయం రాకపోవడంతో తప్పుడు మార్గం పట్టారు. ఈ క్రమంలో వారు డబ్బు, పరపతి ఉన్న యువకులను సోషల్ మీడియాలో గుర్తించి.. వారిని టార్గెట్ చేస్తారు. ఇందులో భాగంగానే తాజాగా కిరణ్ భార్య.. పథకం ప్రకారం భీమిలికి చెందిన సాయి రమేష్ అనే యువకుడిని తన మాటలతో ట్రాప్ చేసింది. ఫిబ్రవరి 14న అలమండ సంత వద్దకు అతడిని రప్పించింది. యువకుడు అక్కడికి చేరుకోగానే, ఉష భర్త కిరణ్ తన అనుచరులతో కలిసి దాడి చేశాడు. “నా భార్యకే మెసేజ్‌లు చేస్తావా?” అంటూ గొడవ సృష్టించి, కత్తితో బెదిరించి బాధితుడి మెడలోని 18 గ్రాముల బంగారు చైన్‌ను లాక్కున్నారు. అదనంగా రూ.70 వేలు డిమాండ్ చేస్తూ, ఫోన్‌లోని ఆధారాలను డిలీట్ చేయించి పంపించేశారు. బాధితుడు మార్చి 3న జామి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. టెక్నాలజీ సాయంతో నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి, బంగారు చైన్, బైక్, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ పి. సౌమ్యలత మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులను గుడ్డిగా నమ్మి ఇలాంటి ఉచ్చులో పడవద్దని ప్రజలను హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీటీడీ కొనుగోళ్లలో ఏఐ విప్లవం.. డిజిటల్ పోర్టల్‌తో అక్రమాలకు చెక్

అసాంఘిక శక్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న టీమ్ ‘రుద్రమ’

విధి ఆడిన వింత నాటకం.. భర్తను బలిగొన్న కరెంటు తీగ

Follow Us