AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kadapa: డెలివరీ బాయ్‌తో పెట్రోల్ తెప్పించి.. అతనిపైనే పోసి నిప్పంటించారు..

మనుషులు రోజురోజుకు ఎలా తయారవుతున్నారో చెప్పడానికి పరాకాష్ఠ ఈ ఘటన. కేవలం అనుమానంతో ఓ యువకుడ్ని సజీవ దహనం చేసే ప్రయత్నం చేశారు కొందరు వ్యక్తులు. అమ్మాయితో చనువుగా ఉంటున్నాడనే డౌట్ రావడంతో ఈ పనికి పూనుకున్నారు. పూర్తి వివరాలు కథనం లోపల ...

Kadapa: డెలివరీ బాయ్‌తో పెట్రోల్ తెప్పించి.. అతనిపైనే పోసి నిప్పంటించారు..
Dilip
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Feb 23, 2026 | 8:58 AM

Share

కేవలం ఒక అనుమానం.. కానీ పరిణామం మాత్రం అమానుషం. కడప జిల్లాలో ఓ ఆన్లైన్ డెలివరీ బాయ్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం బాధితుడు కడపలోని రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం కాశీనాయన మండలం గంగన్నపల్లె గ్రామానికి చెందిన దిలీప్ అనే యువకుడు ఆన్లైన్ డెలివరీ బాయ్‌గా జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతికి పార్సిల్ అందించే సమయంలో అతడు చనువుగా మాట్లాడుతున్నాడనే అనుమానం ఆమె కుటుంబ సభ్యుల్లో కలిగింది. ఈ విషయంపై ఎటువంటి స్పష్టత లేకుండానే యువతి తరపు బంధువులు తీవ్ర చర్యకు పాల్పడ్డారు. దిలీప్‌కు ఫోన్ చేసి “పెట్రోల్ కావాలి… తీసుకురాగలవా?” అని అడిగారు. అతడు తెచ్చిన పెట్రోల్‌ను అతనిపైనే పోసి నిప్పంటించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కలసపాడు మండలం పుల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువతి బంధువులే ఈ దాడికి పాల్పడ్డారని బాధితుడు చెబుతున్నాడు.

కేవలం అనుమానాల ఆధారంగా ఇలాంటి దారుణానికి పాల్పడటం చట్టరీత్యా ఘోర నేరం. ఎవరైనా తప్పు చేసినట్టు అనుమానం వచ్చినప్పుడు మందలించడం లేదా పోలీసులను ఆశ్రయించడం సరైన మార్గం. కానీ నిజానిజాలు తెలుసుకోకుండా ఓ యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించడం మనుష్యత్వానికే మచ్చ. ఇలాంటి ఘటనలు సమాజానికి తీవ్ర హెచ్చరిక. అనుమానం వచ్చినప్పుడు స్వతంత్రంగా తీర్పు చెప్పడం కాదు.. చట్టపరమైన మార్గాన్ని ఆశ్రయించడం మాత్రమే సమంజసం.

Also Read: మోటార్ లేకుండా కాలువ నుంచి వాటర్ ఇలా తీయవచ్చు.. 

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు