AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రికెట్‌ అభిమానులకు పండగలాంటి వార్త.. ధనా ధన్ లీగ్ వచ్చేసింది రోయ్.. మొదటి మ్యాచ్ ఎప్పుడంటే

క్రికెట్‌ అభిమానులకు పండగలాంటి వార్త.. ధనా ధన్ లీగ్ వచ్చేసింది రోయ్.. మొదటి మ్యాచ్ ఎప్పుడంటే

Phani CH
|

Updated on: Mar 10, 2026 | 11:57 AM

Share

క్రికెట్ అభిమానులకు పండగలాంటి వార్త! IPL 19వ ఎడిషన్ మార్చి 28న ప్రారంభమవుతుంది. ఎన్నికల కారణంగా షెడ్యూల్ రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం మార్చి 9న వెలువడే అవకాశం ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మార్చి 28న బెంగళూరులో తొలి మ్యాచ్ ఆడనుంది. ఫ్రాంచైజీలు ప్రాక్టీస్ క్యాంపులతో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

క్రికెట్ అభిమానులకు పండగలాంటి వార్త.. వేసవి వస్తూ వేడితోపాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ను తీసుకొస్తోంది. క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నమెంట్ మార్చి 28న ప్రారంభం కానున్నట్లు అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ధృవీకరించింది. అయితే, దేశవ్యాప్తంగా జరగనున్న ఎన్నికల కారణంగా ఈసారి షెడ్యూల్‌ను రెండు భాగాలుగా విడుదల చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. మార్చి 9 సోమవారం నాడు తొలి భాగం షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మ్యాచ్‌ల తేదీలు, ఎన్నికల పోలింగ్ తేదీలు ఒకేసారి రాకుండా ఉండేందుకు బీసీసీఐ ఈ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నికల కమిషన్ పూర్తి షెడ్యూల్‌ను ఖరారు చేశాక, ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌పై స్పష్టత రానుంది. ముఖ్యంగా ఆర్‌సీబీ, రాజస్థాన్ రాయల్స్.. హోమ్ గ్రౌండ్స్‌పై ఇంకా అనిశ్చితి నెలకొంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రత్యర్థి ఎవరనేది షెడ్యూల్ విడుదలతో తెలుస్తుంది. 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆర్‌సీబీ, 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించి తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు ప్రాక్టీస్ క్యాంపులు ప్రారంభించి, కొత్త జెర్సీలను విడుదల చేస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయ్యో లోతైన బావిలోపడిపోయిన ఏనుగుపిల్ల.. ఎలా బయటపడిందంటే

మహిళల్లోనూ ‘సైలెంట్ కిల్లర్ గా మారుతున్న గుండె సమస్య.. WHO విస్తుపోయే నిజాలు!

ఐస్‌క్రీం తినగానే నీళ్లు తాగుతున్నారా ?? అయితే ఈ సమస్యలు తప్పవు

Viral Video: కారులో కోబ్రా.. షాక్‌లో యజమాని

వీడసలు భర్తేనా.. కట్టుకున్న భార్యను ఎరగా వేసి.. కుర్రాడిని..

Published on: Mar 10, 2026 11:31 AM
Follow Us