AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ontimitta: ఒంటిమిట్ట రాములోరికి ఈ భక్తుడు ఏం చేయించాడంటే..?

రెండో భద్రాద్రిగా పేరొందిన కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రాముల వారి దేవాలయంకు ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రతాపరెడ్డి భారీ విరాళం అందించారు. సీతారామ లక్ష్మణుల ఉత్సవ విగ్రహాల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన మూడు బంగారు కిరీటాలను ఆలయానికి సమర్పించారు. ..

Ontimitta: ఒంటిమిట్ట రాములోరికి ఈ భక్తుడు ఏం చేయించాడంటే..?
Gold Crowns Donation
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Mar 04, 2026 | 8:02 PM

Share

రెండో భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రాముల వారి దేవాలయంకు ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రతాపరెడ్డి భారీ విరాళం అందించారు. సీతారామ లక్ష్మణుల ఉత్సవ విగ్రహాల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన మూడు బంగారు కిరీటాలను ఆలయానికి సమర్పించారు. శ్రీరాముల వారి కళ్యాణోత్సవ వేళ ఆలయం ముస్తాబవుతున్న సమయంలో ఈ విరాళం అందజేయడం విశేషంగా నిలిచింది. కళ్యాణం సందర్భంగా ఉత్సవ విగ్రహాలు పురవీధుల్లో విహరిస్తాయి. ఆ విగ్రహాలకు అలంకరణగా ఉండేలా సీతాదేవి, శ్రీరాముడు, లక్ష్మణుడి కోసం మూడు కిరీటాలను ప్రత్యేకంగా రూపకల్పన చేశారు.

వివరాల ప్రకారం.. సీతాదేవి విగ్రహానికి 750 గ్రాములు, శ్రీరాముల వారికి 670 గ్రాములు, లక్ష్మణుడికి 650 గ్రాముల బంగారంతో కిరీటాలు తయారు చేయించారు. మొత్తం కలిపి 2 కిలోల 70 గ్రాముల బరువున్న ఈ కిరీటాలలో సుమారు 164 గ్రాముల మేలిమి రత్నాలు పొదిగించారు. ఇదే కాక గతంలో మూలవిరాటుకు 6 కిలోల బంగారాన్ని కూడా ప్రతాపరెడ్డి బహుకరించారు. ఇప్పటివరకు ఆయన ఒంటిమిట్ట దేవాలయానికి మొత్తం 8.5 కిలోల బంగారాన్ని సమర్పించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.య భక్తుని ఈ విశేష విరాళంతో ఒంటిమిట్ట ఆలయంలో కళ్యాణోత్సవ వేడుకలు మరింత వైభవంగా జరిగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us