చాణక్య నీతి : మీ ఇంటి విషయాలను అస్సలే చెప్పకూడని వ్యక్తులు ఇవే

Samatha

2 J9uly 2026

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగింది.

అలాగే ఆయన కుటుంబ విషయాలు ఎవరితో పంచుకోకూడదు, ఎవరితో ఈ విషయాలను పంచుకోవడం ప్రమాదమూ తెలియజేయడం జరిగింది.

అయితే చాణక్యుడి ప్రకారం, ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ మాట్లాడుతూ, విషయాలు చేరవేస్తూ ఉంటారు. అలాంటి వారితో ఇంటి విషయాలు పంచుకోకూడదు.

అలాగే మిమ్మల్ని చూసి అసూయపడే వారికి కూడా మీరు చాలా దూరంగా ఉండాలని చెబుతున్నాడు చాణక్యుడు. అలాంటి వారికి ఏ విషయాలు చెప్పకూడదంట.

మిమ్మల్ని చూసి  అసూయపడే వారికి మీరు మీ ఇంటి విషయాలు చెప్పడం వలన వారు మీకు చెడు జరగాలని కోరుకుంటారు.

అంతే కాకుండా చాలా కోపంగా, చిరాకుగా ఉండే వ్యక్తులతో మీరు  మీ ఇంటి విషయాలను చెప్పడం వలన కోపానికి లోను అయ్యే ఛాన్స్ ఉంది.

అందుకే ఎప్పడూ కూడా అలాంటి వారికి దూరంగా ఉండాలి అని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు. వారు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు.

అదే విధంగా స్వార్థ పరులు, దురాశ పరులకు కూడా చాలా దూరంగా ఉండాలి అని చెబుతున్నాడు చాణక్యుడు. లేకపోతే  వారు మిమ్మల్ని కష్టాల్లో నెట్టేస్తారు.