నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమల అడవుల్లో సఫారీ పర్యాటకులకు పెద్దపులి నీళ్లు తాగుతూ కనిపించింది. ఈ అరుదైన దృశ్యం చూసి ఆశ్చర్యపోయిన పర్యాటకులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. నల్లమల టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు.