రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..
కేరళలోని కోజికోడ్‌లో 'ట్రెండ్ ఫ్యాక్టరీ' కొత్త షూ స్టోర్ ప్రారంభోత్సవం ఒక రూపాయికి బ్రాండెడ్ షూస్ ఆఫర్‌తో కలకలం సృష్టించింది. ఈ ఆకర్షణీయ ప్రకటన వేలాది మందిని దుకాణం వద్దకు చేర్చింది. పరిస్థితి చేయిదాటి, తొక్కిసలాటకు, పోలీసుల లాఠీచార్జీకి దారితీసింది. పలువురు చిన్నారులకు గాయాలు కాగా, సరైన అనుమతులు లేనందున స్టోర్ యజమానిని అరెస్ట్ చేశారు. ఇది అటువంటి ప్రచారాల పర్యవసానాలను చూపుతుంది.
కేరళలోని కోజికోడ్ లో కలకలం చెలరేగింది. కేవలం ఒక్క రూపాయి నోటు ఇస్తే విలువైన షూస్ ఉచితంగా ఇస్తామన్న ప్రకటన వేలాది మందిని ఆకర్షించింది. కొత్తగా ప్రారంభమైన ఒక పాదరక్షల దుకాణం ప్రచార ఆర్భాటం కాస్తా లాఠీచార్జీకి దారితీసింది. తొక్కిసలాటలో చిన్నారులు గాయపడటం ఆందోళనకరంగా మారింది. కోజికోడ్‌లోని మానంచిర ప్రాంతంలో ‘ట్రెండ్ ఫ్యాక్టరీ’ కొత్త షూ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా యాజమాన్యం వింత ప్రకటన చేసింది. పాత ఒక రూపాయి నోటుతో వచ్చే మొదటి 100 మంది వినియోగదారులకు బ్రాండెడ్ షూస్ ఉచితంగా అందిస్తామని, ఆ తర్వాతి 100 మందికి చేతి గడియారాలు బహుమతిగా ఇస్తామని ఇన్‌స్టాగ్రామ్ ల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ ప్రకటన క్షణాల్లో వైరల్ కావడంతో, నగర ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో యువకులు, చిన్నారులు దుకాణానికి వచ్చారు. నిజానికి స్టోర్ ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, ఆఫర్ దక్కించుకునేందుకు జనం అర్థరాత్రి 2 గంటల నుంచే క్యూ కట్టారు. దుకాణం దగ్గరకు వేల సంఖ్యలో జనం చేరుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది.. ఒకరినొకరు నెట్టుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన షోరూం నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు గుంపును నియంత్రించేందుకు ప్రయత్నించినప్పటికీ, జనం వెనక్కి తగ్గకపోవడంతో లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. ఈ తొక్కిసలాటలో, పోలీసుల లాఠీచార్జీలో పలువురు చిన్నారులకు గాయాలయ్యాయి. పోలీసులు స్టోర్ యాజమానిని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు అనుమతులు లేకుండా, ఇలాంటి భారీ కార్యక్రమాలు నిర్వహించడంపై కేసు నమోదు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లైవ్ వీడియోలో యూట్యూబర్ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్
Weather Update: దంచికొడుతోన్న ఎండలు.. ఈ ఏడాది దబిడిదిబిడే
విరోష్ పెళ్లిపై చిన్నారి పాప అలక.. మమ్మల్ని ఎందుకు పిలవలేదు?
క్రికెట్ అభిమానులకు పండగలాంటి వార్త.. ధనా ధన్ లీగ్ వచ్చేసింది రోయ్.. మొదటి మ్యాచ్ ఎప్పుడంటే
స్కూల్ హెడ్మాస్టర్ నిర్వాకం.. పిల్లలతో మసాజ్..
రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..
లైవ్ వీడియోలో యూట్యూబర్ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్
అయ్యో లోతైన బావిలోపడిపోయిన ఏనుగుపిల్ల.. ఎలా బయటపడిందంటే
Viral Video: కారులో కోబ్రా.. షాక్‌లో యజమాని
వీడసలు భర్తేనా.. కట్టుకున్న భార్యను ఎరగా వేసి.. కుర్రాడిని..
విధి ఆడిన వింత నాటకం.. భర్తను బలిగొన్న కరెంటు తీగ

