తెలంగాణ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తన ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ప్రకటించారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 2,558 కోట్లు కాగా, వార్షిక ఆదాయం రూ. 374 కోట్లుగా ఉంది. దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ నాయకులలో సింఘ్వీ ఒకరుగా నిలిచారు.