విజయవాడ పీజీ విద్యార్థిని డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆమె మృతికి కారణమైన సీనియర్ రెసిడెంట్ డాక్టర్ అలుగుపల్లి అమర్‌ను మాచవరం పోలీసులు అరెస్టు చేశారు. ప్రియుడి మోసం వల్లే దీపిక తీవ్ర మనస్తాపానికి గురై ప్రమాదకర ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ అరెస్టుతో న్యాయం కోసం పోరాడుతున్న తండ్రికి ఊరట లభించింది.