17 ఏళ్ళ తరువాత పెద్దమ్మ తల్లి దేవర … కళ్ళు చెదిరిపోయేలా చేసిన మహిళలు
అక్కడ ఫ్యాక్షన్ కాదు దైవత్వం కూడా నిండుగా ఉంటుంది.. 17 ఏళ్ల తర్వాత ఆ ప్రాంతంలో పెద్దమ్మ తల్లి దేవర జరుపుతున్నారు... ఆ దేవరకు మహిళలు వినూత్న రీతిలో అందరినీ ఆకట్టుకున్నారు... 1200 కలశాలతో భారీ ఊరేగింపుగా వెళ్ళి పెద్దమ్మతల్లికి కళాశాలలోని నీటితో అభిషేకం చేశారు.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది అక్కడ జరిగే ఫ్యాక్షన్ … అయితే అక్కడ జనాలలో ఫ్యాక్షన్ తో పాటు దైవభక్తి కూడా ఎక్కువే అలాగే ఉంటుంది మరి అక్కడ.. ఆ దైవభక్తిని చాటుకోవడానికి ఈరోజు మహిళలందరూ చేసిన ఆ వినూత్న ప్రయత్నం అందరిని ఆకట్టుకుంది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత జమ్మలమడుగులో పెద్దమ్మ తల్లి దేవర జాతరలు చేశారు. ఆ కార్యక్రమానికి 1200 మంది మహిళలు కలశాలను మోసుకుంటూ గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వరి ఆలయం నుండి జమ్మలమడుగులోని పురవీధులన్నీ తిరుగుతూ పెద్దమ్మ తల్లి దేవాలయానికి చేరుకుని కళాశాలలోని నీటితో ఆ తల్లికి అభిషేకం చేశారు. ఈరోజు నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఒకటవ తేదీ అమ్మవారికి నైవేద్య కార్యక్రమం ఉంటుంది. అప్పటివరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. ఈ జాతరకు రాష్ట్రంలోని నలుమూలలో ఉన్న ఆ ప్రాంత ప్రజలందరూ అక్కడకు చేరుకున్నారు. మహిళలు అందరు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్దమ్మతల్లి దేవర జాతరలో పాల్గొనటంతో రోడ్లన్నీ పసుపు మయం అయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం :
తొందరేంటి.. కనీసం చెప్పేవరకు ఆగరా..?
ఎర్ర బటన్, పచ్చ బటన్ ఐబొమ్మ రవి పరిస్థితి ఇదే!
టీజర్ లాంఛ్ లో విశ్వక్ సేన్ క్రేజీ కామెంట్స్
క్షణం క్షణం భయం..4 ఏళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న హర్రర్ మూవీ ఇదే
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

