Bank Holidays: సెప్టెంబర్ 26 నుండి 30 వరకు బ్యాంకులకు వరుసగా ఐదు రోజుల సెలవులు రానున్నాయి. శని, ఆదివారాలతో పాటు 28, 29, 30 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ కస్టమర్లను అప్రమత్తం చేసింది. ముఖ్యమైన పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించింది. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి.