హైదరాబాద్ జలమండలి నీటి సంరక్షణకు కఠిన చర్యలు చేపట్టింది. నీటిని వృధా చేస్తున్న వారిపై రూ.20,000 వరకు జరిమానాలు విధిస్తోంది. అధికారులు కూడా తమ పరిధిలో లీకేజీలు, వృధా నీటిని అరికట్టకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. నీటి విలువను గుర్తించి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.