AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: తెల్లారి పొలానికి వెళ్లిన రైతుకు కనిపించిన పెద్ద గొయ్యి.. ఏంటని చూడగా కళ్లు తేలేశాడు

తెల్లారి పొలం పనులకు రైతులు వచ్చారు. దూరం నుంచి ఓ గొయ్యిని చూశారు.. ఏంటా అని వెళ్లి చూడగా.. దెబ్బకు దడుసుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో జరిగింది. ఆ వివరాలు ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. మరి లేట్ ఎందుకు ఓ సారి చూసేయండి.

Andhra: తెల్లారి పొలానికి వెళ్లిన రైతుకు కనిపించిన పెద్ద గొయ్యి.. ఏంటని చూడగా కళ్లు తేలేశాడు
Path Hole
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Mar 03, 2026 | 2:06 PM

Share

పంటలు పండే పొలంలో భారీ గొయ్యి పడటంతో అక్కడ ఉన్న గ్రామస్తులు, రైతులలో భయాందోళనలు మొదలయ్యాయి. సడన్‌గా అంత పెద్ద గొయ్యి ఎందుకు పడిందా అని గ్రామస్తులందరూ ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ శాఖకు సమాచారాన్ని అందించారు. వారు సంఘటనాస్థలానికి వచ్చి దానిని పరిశీలించి అక్కడ ఉన్న మట్టిని ల్యాబ్‌కు పంపించారట. అసలు ఇంతకు అక్కడ అంత పెద్ద గొయ్యి ఎందుకు పడింది.! వివరాల్లోకి వెళ్తే.. కడప నగరానికి కూతవేటు దూరంలో ఉన్న కాజీపేట మండలం చెముళ్లపల్లి గ్రామ పరిధిలోని సి.కొత్తపేట గ్రామ పొలాల్లో సడన్‌గా పెద్ద గొయ్యి దర్శనమిచ్చింది.

రైతులకు అక్కడ అంత పెద్ద గొయ్యి కనబడటంతో అందరూ షాక్ అయ్యారు. స్థానికులందరూ అక్కడకు చేరి ఆ గొయ్యిని చూసి మొదట భయాందోళనకు గురై స్థానిక రెవెన్యూ అధికారులకు సమాచారాన్ని అందించారు. వారు వచ్చి ఆ గొయ్యిని పరిశీలించారు. అది దాదాపు రెండున్నర అడుగుల వెడల్పు ఉండి.. 15 నుంచి 20 అడుగుల లోతు వరకు పడింది. అయితే ఆ గుంతలో అడుగుభాగాన నీళ్లు ఉండటంతో అది గతంలో బావి కోసం తవ్విన గొయ్యి లేదా భూమిలో సారం తగ్గి అంత పెద్ద గొయ్యి పడిందా అనే దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రెవెన్యూ అధికారులు. అంత పెద్ద గొయ్యి పడాలి అంటే గతంలో అక్కడ బావిని తవ్వి ఉండడమే ప్రధాన కారణంగా రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కానీ అసలు విషయం తెలుసుకోవడానికి ఆ భూమికి సంబంధించిన మట్టిని ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం. ఏది ఏమైనా ఉన్నట్టుండి పొలంలో అంత పెద్ద గొయ్యి పడటంతో స్థానిక రైతులు గ్రామస్తులలో ఆందోళన నెలకొంది.

ఇది చదవండి: హైదరాబాద్‌లో ‘ఖమేనీ’ పేరుతో రోడ్డు ఉందని మీకు తెలుసా.? ఆ పేరు ఎలా వచ్చిందంటే

Follow Us
రీల్స్ పిచ్చితో లోకల్ రైలుపై రాళ్ల దాడి నాటకం.. సీన్‌ కట్‌చేస్తే
రీల్స్ పిచ్చితో లోకల్ రైలుపై రాళ్ల దాడి నాటకం.. సీన్‌ కట్‌చేస్తే
నా భర్త మంచోడే, ఆ అమ్మాయే ఇలా చేసింది..
నా భర్త మంచోడే, ఆ అమ్మాయే ఇలా చేసింది..
కూతురి వెంట పడొద్దని మందలించిన తండ్రి! దారుణానికి తెగబడ్డ ఉన్మాది
కూతురి వెంట పడొద్దని మందలించిన తండ్రి! దారుణానికి తెగబడ్డ ఉన్మాది
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలో మహేష్ బాబు అన్న కుమారుడి సినిమా
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలో మహేష్ బాబు అన్న కుమారుడి సినిమా
మనుషులేనా.. గాయాన్ని దాచిపెట్టి సిరాజ్‌ను ఆడిస్తారా..!
మనుషులేనా.. గాయాన్ని దాచిపెట్టి సిరాజ్‌ను ఆడిస్తారా..!
ఉసేన్ బోల్ట్ రికార్డులను సవాలు చేస్తున్న సూపర్‌మ్యాన్ రోబోట్!
ఉసేన్ బోల్ట్ రికార్డులను సవాలు చేస్తున్న సూపర్‌మ్యాన్ రోబోట్!
ఎన్టీఆర్‏తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే..
ఎన్టీఆర్‏తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే..
కెప్టెన్‌గా కోహ్లీ, రోహిత్‌కే సాధ్యంకాలే.. అరుదైన రికార్డులో గిల్
కెప్టెన్‌గా కోహ్లీ, రోహిత్‌కే సాధ్యంకాలే.. అరుదైన రికార్డులో గిల్
పెళ్లయిన జంటలు మళ్లీ పెళ్లి.. అప్పులు తీరుతాయనేనా?
పెళ్లయిన జంటలు మళ్లీ పెళ్లి.. అప్పులు తీరుతాయనేనా?
అందరికీ ఆర్థిక పాఠాలు చెప్పే రాబర్ట్ కియోసాకికే వేల కోట్ల అప్పులు
అందరికీ ఆర్థిక పాఠాలు చెప్పే రాబర్ట్ కియోసాకికే వేల కోట్ల అప్పులు
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర