Andhra Pradesh: రెండో భద్రాద్రి ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్సవాల సందడి ప్రారంభం
కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. భక్తులు ప్రేమగా రెండో భద్రాద్రిగా పిలిచే ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం అంతా విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. ప్రధాన గోపురం నుంచి ఆలయం లోపలి మండపాల వరకు..

రెండవ భద్రాద్రిగా పిలవబడే ఒంటిమిట్ట శ్రీ కోదండ రాములవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది .. ఈనెల 27 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి నిండు పౌర్ణమిలో సీతారాముల వారి కళ్యాణం జరపడానికి టిటిడి ఆధ్వర్యంలో పనులు ప్రారంభమయ్యాయి … అలాగే రామతీర్థం మరియు లక్ష్మణ తీర్థం గుట్టల్లో పచ్చదనం పెంచేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలను తీసుకుంటుంది.
కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాటుకు పనులు మొదలయ్యాయి.. టీటీడీ జేఈవో వీరభద్రం పనులను పరిశీలించారు. ఏప్రెల్ ఒకటవ తేదీన జరిగే సీతారాముల వారి కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న పనులను కూడా పరిశీలించారు. రామతీర్థం మరియు లక్ష్మణ తీర్థం గుట్టలో పచ్చదనం పెంపొందించాలని టిటిడి ప్రత్యేక దృష్టి సారిస్తోంది ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం సమీపంలోని ఈ రెండు తీర్థాలలో వాతావరణం అనుకూలంగా దీర్ఘకాలికంగా చెట్లు పెరిగేలా ప్రణాళికలు చేస్తున్నారు.
అటవీ శాఖ అధికారులతో అలాగే ఇంజనీరింగ్ శాఖ అధికారులతో చర్చించి రామతీర్థం మరియు లక్ష్మణ తీర్థం పరిసర ప్రాంతమైన పది హెక్టార్లలో ఏ జాతి మొక్కలు పెరుగుతాయి అనే దానిపై నిర్ణయం తీసుకొని వాటిని పెంచాలి అనే ఆలోచనలో టీటీడీ ఉంది.. ప్రణాళిక బద్ధంగా మొక్కలు నాటి ఒంటిమిట్ట పరిసర ప్రాంతాన్ని పచ్చదనంతో నింపేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటుంది .. దీనికి సంబంధించి టిటిడి, అటవీశాఖ సంయుక్తంగా ఈ కార్యచరణను చేపట్టనుంది. అంతేకాకుండా ఈనెల 27 నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్నారు.. ఈసారి దాదాపు లక్ష యాభై వేల మందికి లడ్డు ప్రసాదాలు అలాగే తలంబ్రాలు అందించేందుకు పనులు ప్రారంభమయ్యాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




