AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే..

ప్రకృతి సృష్టించే వింతలు కొన్నిసార్లు మనల్ని ఆశ్చర్యపరిస్తే.. మరికొన్నిసార్లు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి. సాధారణంగా ఒకే ఒక్క పాము కనిపిస్తేనే మనం ఆమడ దూరం పరుగెడతాం. అలాంటిది లక్షలాది పాములు ఒకే చోట గుమిగూడి.. ఒకదానిపై ఒకటి చుట్టుకుంటూ ఉంటే ఆ సీన్ ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది కదూ.. కానీ అలాంటి సీన్ ఓ చోట నిజంగానే జరుగుతుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Video: పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే..
Worlds Largest Gathering Of Red Sided Garter Snakes
Krishna S
|

Updated on: Jun 17, 2026 | 5:17 PM

Share

ప్రకృతి ఒడిలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. కొన్ని ప్రకృతి దృశ్యాలు మనల్ని మంత్రముగ్ధులను చేస్తే.. మరికొన్ని దృశ్యాలు మాత్రం మన వెన్నులో వణుకు పుట్టిస్తాయి. సాధారణంగా మనం పాములను ఒంటరి జీవులుగానే చూస్తుంటాం. కానీ ప్రతి సంవత్సరం లక్షలాది పాములు ఒకే చోట గుమిగూడే వింత, అత్యంత భయానక దృశ్యం ఒకటి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ వింతను కళ్లారా చూసిన పర్యాటకులు, వన్యప్రాణి ప్రేమికులు దీనిని ఏకంగా పాముల కుంభమేళా అని పిలుస్తున్నారు. ఇంతకీ ఈ వింత ఎక్కడ జరుగుతుంది? ఆ పాముల కథేంటో ఇప్పుడు చూద్దాం..

ఈ పాముల పండుగ ఎక్కడ జరుగుతుంది?

ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన ఈ వన్యప్రాణి దృగ్విషయం ప్రతి సంవత్సరం కెనడాలోని గ్రామీణ ప్రాంతమైన మానిటోబాలోని నార్సిస్సేలో జరుగుతుంది. ఇక్కడి ప్రసిద్ధ పాముల గుహలు ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలల మధ్య యాక్టివ్ గా మారుతాయి. ఈ సమయంలో లక్షలాది రెడ్ సైడెడ్ గార్టర్ స్నేక్స్ ఈ ప్రాంతానికి వలస వస్తాయి. సంవత్సరం పొడవునా ఎక్కడో ఏకాంతంగా బతికే ఈ పాములు.. కేవలం తమ సంతానోత్పత్తి కాలంలో మాత్రమే ఒకే చోటుకు రావడం విశేషం.

ప్రపంచంలోనే అతిపెద్ద స్నేక్ గ్యాదరింగ్

శాస్త్రవేత్తల ప్రకారం.. ఇది ప్రపంచంలోనే పాముల అతిపెద్ద సహజ సమూహంగా గుర్తించబడింది. ఇక్కడ వేలాది పాములు ఒకే పెద్ద రంధ్రంలో లేదా గుహలో కలిసి జంటలుగా సంభోగిస్తూ కనిపిస్తాయి. అయితే ఈ జాతి పాములలో ఆడ పాముల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఒకే ఒక్క ఆడ పామును ఆకర్షించడానికి వందలాది మగ పాములు తీవ్రంగా పోటీపడతాయి. కొన్నిసార్లు వందకు పైగా మగ పాములు ఒకే ఆడ పాముపైకి ఎక్కి, ఒకదాని చుట్టూ ఒకటి చుట్టుకుంటూ మేటింగ్ బాల్స్‌లాగా ఏర్పడతాయి. ఈ దృశ్యం చూడటానికి ఎంత భయానకంగా ఉంటుందో.. ప్రకృతి పరంగా అంత పెద్ద అద్భుతం.

పర్యాటక కేంద్రంగా మారిన పాముల స్వర్గం

ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులు, పరిశోధకులు ఈ వింతైన దృశ్యాన్ని వీక్షించడానికి ఇక్కడికి పోటెత్తుతుంటారు. ప్రజల ఆసక్తిని గమనించిన స్థానిక కెనడా ప్రభుత్వం ఈ ప్రాంతం మొత్తాన్ని ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చింది. సందర్శకులు ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితమైన దూరం నుండి ఈ పాముల ముచ్చట్లను చూసేందుకు వీలుగా ప్రత్యేక వీక్షణా పాయింట్స్‌ను ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండటంతో.. నెటిజన్లు దీనిని పాముల స్వర్గం అని అంటున్నారు.

సున్నపురాయి గుహల్లో దాగున్న రహస్యం

మరి లక్షలాది పాములు ఇక్కడికే ఎందుకు వస్తాయనే దానికి ఒక వాతావరణ రహస్యం ఉంది. మానిటోబాలోని ఈ ప్రాంతంలో లోతైన సున్నపురాయి గుహలు ఉన్నాయి. తీవ్రమైన చలికాలంలో మంచు కురుస్తున్నప్పుడు ఈ పాములు చలికి తట్టుకోలేక నిద్రాణస్థితిలోకి వెళ్లిపోతాయి. అలా దాక్కోవడానికి ఈ గుహలు వీటికి రక్షణ కల్పిస్తాయి. వసంతకాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభమైన వెంటనే, అవన్నీ ఒకేసారి బయటకు వచ్చి సంభోగ ప్రక్రియను ప్రారంభిస్తాయి. ఈ కాలం ముగిసిన తర్వాత అవి తిరిగి తమ సాధారణ అడవులు, చిత్తడి నేలలకు వెళ్ళిపోతాయి.

ఈ పాములు మనుషులకు ప్రమాదకరమా?

ఇంత పెద్ద సంఖ్యలో పాములను ఒకేచోట చూస్తే ఎవరికైనా గుండె గుభేల్ అనడం ఖాయం. అయితే వన్యప్రాణి నిపుణుల ప్రకారం.. ఈ ఎర్రపక్కల గార్టర్ పాములు విషరహితమైనవి. ఇవి కరిచినా మానవ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఈ పాములు సాధారణంగా నల్లగా ఉండి, వాటి పైభాగంలో ఎరుపు లేదా పసుపు రంగు చారలు, మచ్చలను కలిగి ఉంటాయి. కెనడా ప్రభుత్వం ఈ వింత ప్రాంత పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ఇక్కడి పాములను పట్టుకోవడానికి ప్రయత్నించినా, లేదా వాటికి ఆటంకం కలిగించినా చట్టప్రకారం భారీ జరిమానాలు విధిస్తారు.

వీడియో చూడండి..

Follow Us
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
"ఇరాన్ మాట తప్పితే.. మళ్లీ బాంబులే!" - ట్రంప్ వార్నింగ్
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?