మంచిర్యాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ దుకాణం ముందు ఇంజన్ ఆపకుండా ట్రాక్టర్ పార్క్ చేసిన డ్రైవర్ శ్రీనివాస్, అది అనుకోకుండా ముందుకు కదలడంతో నిలువరించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ చక్రాల కింద పడి మరణించాడు. ఈ హృదయ విదారక దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.