AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోరూరించే ఆంధ్రా స్టైల్ దోసకాయ ఎండుచేపల కూర.. అన్నంలోకి తింటే స్వర్గమే!

పసుపు దోసకాయ, ఎండుచేపల కాంబినేషన్‌తో చేసే ఈ పల్లెటూరి స్టైల్ కూర ఆంధ్ర వంటకాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఘాటు, కారం, పులుపు రుచుల కలయికతో నోరూరించే ఈ కూరను సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి అద్భుతంగా సరిపోయే ఈ సంప్రదాయ వంటకం కుటుంబ సభ్యులందరికీ ఎంతో నచ్చుతుంది.

Phani CH
|

Updated on: Jun 17, 2026 | 3:50 PM

Share
మన పూర్వీకుల కాలం నాటి సాంప్రదాయ వంటకాలలో ఎండుచేపలతో చేసే కూరలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతంలో ఎండుచేపలను రకరకాల కూరగాయలతో కలిపి వండుతుంటారు. అందులోనూ పుల్లపుల్లగా ఉండే పసుపు దోసకాయ (Yellow Cucumber) మరియు ఎండుచేపల కాంబినేషన్ వినడానికి కాస్త భిన్నంగా ఉన్నా, తింటే మాత్రం లొట్టలేసుకోవాల్సిందే.

1 / 5
పల్లెటూరి శైలిలో ఘాటుగా, కారంగా వండే ఈ కూర వండుతున్నప్పుడు వచ్చే సువాసనకే ఇల్లంతా నోరూరుతుంది. బ్యాచిలర్స్ కూడా ఎంతో సులభంగా చేసుకునేలా, పక్కా విలేజ్ స్టైల్‌లో ఈ దోసకాయ ఎండుచేపల కూర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ కూర తయారీ కోసం ముందుగా మంచి నాణ్యమైన ఎండుచేపలను తీసుకుని, వాటి తలలు, తోకలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

2 / 5
ఆ తర్వాత ఈ ముక్కలను కాస్త గోరువెచ్చని నీటిలో ఐదు నిమిషాల పాటు నానబెట్టి, రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చేపలపై ఉండే ఇసుక, ఉప్పు పూర్తిగా పోతాయి. మరోపక్క ఒక దోసకాయను తీసుకుని, పైన తొక్క తీసి, లోపల గింజలు చేదుగా లేవని నిర్ధారించుకున్నాక చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలిలో మూడు పెద్ద చెంచాల నూనె వేసి వేడి చేయాలి. నాన్-వెజ్ కూరలకు నూనె కాస్త ఎక్కువ ఉంటేనే రుచి బాగుంటుంది. నూనె కాగాక అందులో అర చెంచా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత ఒక కప్పు సన్నని ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లిపాయలు దోరగా మారే వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగాక, ముందుగా కడిగి పెట్టుకున్న ఎండుచేపల ముక్కలను అందులో వేసి నూనెలో రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి. చేపలు నూనెలో వేగడం వల్ల కూరకు మంచి ఫ్లేవర్ వస్తుంది.

4 / 5
చేపలు వేగిన తర్వాత అందులో ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా వేయించాలి. ఆపై కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, అర చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. దోసకాయలోని నీటితోనే ముక్కలు మెత్తగా మగ్గుతాయి. ముక్కలు సగం ఉడికాక, అందులో రెండు చెంచాల కారం, ఒక చెంచా ధనియాల పొడి వేసి కలపాలి. చివరగా కూర గ్రేవీ కోసం ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసి, మూత పెట్టి సన్నని మంటపై నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. అంతే, వేడివేడి అన్నంలోకి ఎంతో కమ్మగా ఉండే దోసకాయ ఎండుచేపల కూర సిద్ధం.

5 / 5
Follow Us