AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మన హీరోలకు బేసిక్ సినిమా నాలెడ్జ్‌ లేదు

మన హీరోలకు బేసిక్ సినిమా నాలెడ్జ్‌ లేదు

Phani CH
|

Updated on: Jun 17, 2026 | 4:39 PM

Share

Mahi V Raghav చేసిన తాజా వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. కథలు, పాత్రల లోతును అర్థం చేసుకోవడంలో చాలా మంది హీరోలు వెనుకబడి ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా క్రాఫ్ట్ కంటే మార్కెట్, బాక్సాఫీస్ లెక్కలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని పేర్కొన్నారు. అయితే వ్యక్తిగతంగా ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదని కూడా స్పష్టం చేశారు.

మహి వి రాఘవ! టాలీవుడ్‌ లో వన్‌ ఆఫ్ ది ట్యాలెంటెడ్ డైరెక్టర్‌. యాత్ర సినిమాతో డైరెక్టర్‌గా తనను తాను ప్రూఫ్‌ చేసుకున్న ఈయన.. ఆనందో బ్రహ్మ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక సేవ్ ది టైగర్స్ క్రియేటర్‌గా కూడా మంచి మార్కులే దక్కించుకున్నాడు. ఎట్ ప్రజెంట్ తన సేవ్ ది టైగర్స్ 3 సిరీస్‌ను ప్రమోట్ చేసే పనిలో ఉన్న రాఘవ… ఓ ఇంటర్వ్యూలో మన టాలీవుడ్‌ హీరోలకు బేసిక్ సినిమా సెన్స్ కూడా ఉండదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు తన కామెంట్స్‌తో నెట్టింట వైరల్ అవుతున్నాడు ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రస్తుత ట్రెండ్స్.. మేకర్స్ ఆలోచనా విధానంపై మాట్లాడిన రాఘవ.. చాలా మంది హీరోలకు ఒక కథను ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియదన్నాడు. కథలోని పాత్రల ప్రాధాన్యతను పక్కన పెట్టి.. కేవలం సినిమా మార్కెట్ పైన.. బాక్సాఫీస్ బిజినెస్ పైన.. ప్రాజెక్ట్ సైజ్ పైన మాత్రమే దృష్టి పెడుతున్నారని చెప్పుకొచ్చాడు. సినిమా మేకింగ్ ప్రాసెస్ను… కథలోని తమ పాత్రల లోతను అర్థం చేసుకోవడం లేదని విమర్శించాడు. అంతేకాదు ఏ హీరోని వ్యక్తిగతంగా కించపచడం తన ఉద్దేశ్యం కాదని… ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితి ఎత్తి చూపడమే తన ఉద్దేశ్యం అన్నాడు డైరెక్టర్ రాఘవ. హీరోలకు కథల పట్ల, సినిమా క్రాఫ్ట్ పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల కథా చర్చల సమయంలో దర్శకులు తమ విజన్‌ను వారికి అర్థమయ్యేలా చెప్పడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందనే ఆవేదన ఆయన మాటల్లో వ్యక్తమైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సినిమాల తర్వాత ప్రజాసేవే లక్ష్యం.. రాజకీయాల్లోకి మరో తమిళ స్టార్

ప్రేమ చేసిన హత్య? పాపం! సంచిత!

బిగ్ బాస్‌ 10 ఫస్ట్ కంటెస్టెంట్‌గా.. సీరియల్ బ్యూటీ ఫిక్స్?

వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు బాబూ.. బ్రతకాలని లేదా నీకు!

అస్థిపంజరాలు చెప్పిన లక్షల ఏళ్ల నాటి రహస్యం..

Follow Us