AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు బాబూ.. బ్రతకాలని లేదా నీకు!

వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు బాబూ.. బ్రతకాలని లేదా నీకు!

Phani CH
|

Updated on: Jun 17, 2026 | 4:20 PM

Share

బిజీ ట్రాఫిక్‌లో బైక్ నడుపుతూ ల్యాప్‌టాప్‌పై ఆఫీస్ పని చేస్తున్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రమాదకర చర్యపై పోలీసులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవింగ్ సమయంలో ఏకాగ్రత కోల్పోతే ప్రాణాపాయం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘వర్క్ ఫ్రమ్ బైక్’ పేరుతో చేసిన ఈ నిర్లక్ష్య చర్య రోడ్డు భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది.

ఉద్యోగం చేయడం, కష్టపడడం తప్పు కాదు.. కానీ ఆ కష్టం ప్రాణాల మీదకు తెచ్చేలా ఉండకూడదు. ఆఫీస్ డెడ్‌లైన్లు, కంపెనీ టార్గెట్ల ఒత్తిడి ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే ఎవరికైనా ఒళ్ళు జలదరించక మానదు. బిజీ ట్రాఫిక్‌లో వేగంగా వెళ్తున్న ఒక వ్యక్తి, బైక్‌పై హ్యాండిల్ మధ్యలో ల్యాప్‌టాప్ పెట్టుకుని ఆఫీస్ వర్క్ చేస్తూ డ్రైవింగ్ చేస్తున్నాడు. ప్రాణాలను పణంగా పెట్టి అతడు చేస్తున్న ఈ ‘వర్క్ ఫ్రమ్ బైక్’ ప్రయోగం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ బాధ్యతారాహిత్యమైన వీడియోపై సీపీ సజ్జనార్ తీవ్రంగా మండిపడుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. “ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదకు వస్తుంది” అంటూ నెటిజన్లు సైతం ఈ స్టంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు ప్రయాణించడానికి మాత్రమే.. ఆఫీస్ పనులు చేసుకోవడానికి కాదు. ఇలాంటి స్టంట్లు డిజిటల్ యుగంలో పెరిగిపోతున్న వర్క్ ప్రెజర్ ను చూపిస్తున్నాయా? లేక సదరు వ్యక్తి నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. “ఇది కదా అసలైన ల్యాప్‌టాప్ రైడింగ్” అంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులను కోరుతున్నారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడడమే నేరమైతే, ఏకంగా ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి వర్క్‌ చేస్తూ డ్రైవ్ చేయడం పరాకాష్ట. రోడ్డుపై ఏకాగ్రత ఒక్క క్షణం తప్పినా.. అది సదరు వ్యక్తికే కాక, పక్కన వెళ్లే అమాయకుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతుంది. ఆఫీస్ పని కాసేపు ఆలస్యమైనా పర్లేదు కానీ.. ఇంట్లో ఎదురుచూసే కుటుంబ సభ్యుల కోసం సురక్షితంగా ప్రయాణించాలని ట్రాఫిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అస్థిపంజరాలు చెప్పిన లక్షల ఏళ్ల నాటి రహస్యం..

Follow Us