అస్థిపంజరాలు చెప్పిన లక్షల ఏళ్ల నాటి రహస్యం..
హిందూ మహాసముద్రం అడుగున ఏడు కిలోమీటర్ల లోతులో వందలాది తిమింగలాల అస్థిపంజరాలతో కూడిన భారీ శ్మశాన వాటికను శాస్త్రవేత్తలు గుర్తించారు. దాదాపు వెయ్యి కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఈ అస్థిపంజరాల్లో కొన్ని లక్షల సంవత్సరాల నాటివిగా భావిస్తున్నారు. ఈ అరుదైన ఆవిష్కరణ సముద్ర గర్భంలోని జీవవ్యవస్థ, తిమింగలాల జీవన చక్రం గురించి కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది.
సముద్రం.. పైకి ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో, లోపల అన్ని వింతలను, రహస్యాలను దాచుకుంటుంది. భూమిపై ప్రతి కొండ, లోయ మ్యాపింగ్ చేసిన మానవుడికి.. సముద్రాల అడుగుభాగాల గురించి తెలిసింది చాలా తక్కువ. తాజాగా హిందూ మహాసముద్రం లోపల శాస్త్రవేత్తలు ఒక మైండ్ బ్లోయింగ్ నిజాన్ని కనుగొన్నారు. సముద్ర గర్భంలో దాగున్న సమాంతర ప్రపంచాన్ని బట్టబయలు చేసారు. ఏడు కిలోమీటర్ల లోతున,చిమ్మ చీకట్లో వందలాది తిమింగలాల అస్థిపంజరాలతో భారీ శ్మశాన వాటికను శాస్త్రవేత్తలు గుర్తించారు. అస్థిపంజరాల సమూహం నమ్మలేని రీతిలో వెయ్యి కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. వాటిలో కొన్ని యాభై లక్షల సంవత్సరాల నాటివని అంచనా వేసారు. ఈ పరిశోధన.. ప్రాచీన సముద్ర పర్యావరణ వ్యవస్థపై సరికొత్త విషయాలను బయటపెట్టింది. సాధారణంగా ఓ భారీ తిమింగలం చనిపోయినప్పుడు దాని కళేబరం సముద్రం అడుగుభాగానికి చేరుకుంటుంది. కానీ ఒకే చోట తిమింగలాల కళేబరాలు పోగుపడటం, భారీ శ్మశాన వాటిక బయటపడటం అంతర్జాతీయ సైన్స్ చరిత్రలోనే అరుదని అంటున్నారు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను విశ్లేషిస్తున్నారు. తిమింగలం చనిపోయిన కొద్ది రోజుల్లోనే దాని మాంసాన్ని పెద్ద పెద్ద చేపలు ఆహారంగా తీసుకుంటాయి. మిగిలిన అస్థిపంజరంపై ఎముకలను తినే పురుగులు, సూక్ష్మజీవులు దాడి చేసి క్షీణించేలా చేస్తాయి. సముద్రం లోతుల్లో జీవించే జలచరాలు కేవలం ఈ కళేబరాలనే ఆహారంగా చేసుకుని జీవనం సాగిస్తాయి. ఇందుకోసం డీప్-సీ కెమెరాలను రోబోటిక్ వాహనాలను రంగంలోకి దించారు. వీటి ద్వారా సేకరించిన వీడియోలు, చిత్రాల ఆధారంగా అస్థిపంజరాలు శతాబ్దాలుగా నీటి కింద ఉన్నట్లు గుర్తించారు. తిమింగలాల ఎముకలు లక్షల సంవత్సరాల పాటు నీటి అడుగున నిలిచి ఉన్నప్పటికీ, ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లలు.. డీఎన్‌ఏ టెస్టులో షాకింగ్ విషయాలు
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్‌నెస్..!
శ్రేయస్ అయ్యర్ ఇంటి అద్దె రూ.7.14 కోట్లు
అస్థిపంజరాలు చెప్పిన లక్షల ఏళ్ల నాటి రహస్యం..
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్‌నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?
క్లీనర్, కార్ వాషర్గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ

