AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లలు.. డీఎన్‌ఏ టెస్టులో షాకింగ్‌ విషయాలు

ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లలు.. డీఎన్‌ఏ టెస్టులో షాకింగ్‌ విషయాలు

Phani CH
|

Updated on: Jun 16, 2026 | 3:44 PM

Share

హరియాణాలోని గుర్గావ్‌కు చెందిన ఓ జంటకు ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లలు జన్మించారు. అయితే పిల్లల అనారోగ్యంతో నిర్వహించిన డీఎన్‌ఏ, జన్యు పరీక్షల్లో వారు తల్లిదండ్రుల బయోలాజికల్ సంతానం కాదని తేలింది. దీంతో షాక్‌కు గురైన దంపతులు కోర్టును ఆశ్రయించగా, ఐవీఎఫ్ కేంద్రంపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఘటన ఐవీఎఫ్ కేంద్రాల నిర్వహణపై తీవ్ర చర్చకు దారితీసింది.

ఐవీఎఫ్ ప్రక్రియ కొన్ని చోట్ల వివాదాస్పదమవుతోంది. హరియాణాలో ని గుర్గావ్‌కు చెందిన ఒక జంటకు సంతానం కలగలేదు. దాంతో వారు ఐవీఎఫ్ సెంటర్లను ఆశ్రయించారు. అందులో ఒక సంస్థ వారికి ఐవీఎఫ్ ద్వారా సంతానం కలిగేలా చేయడానికి అంగీకరించింది. ఇందుకోసం ఆ జంట నుంచి అండం, శుక్రకణాల్ని సేకరించారు. అనంతరం ఐవీఎఫ్ విధానంలో ఆ జంట కవల పిల్లల్ని కన్నాది. కొద్దిరోజుల క్రితం పిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దాంతో వారు ఆస్పత్రికి వెళ్లగా, అక్కడ జెనెటిక్ పరీక్షలు కూడా అవసమరయ్యాయి. అలా జెనెటిక్, డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించగా సంచలన విషయం బయటపడింది. ఆ పిల్లలకు, వారి తల్లిదండ్రులకు అసలు సంబంధం లేదని తేలింది. తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరి డీఎన్‌ఏతో ఆ పిల్లల డీఎన్‌ఏ మ్యాచ్ కాలేదు. ఆ పిల్లలు తమ పిల్లలే అని సూచించే ఇతర పరీక్షలు నిర్వహించినా ఫలితాలు వారికి వ్యతిరేకంగానే వచ్చాయి. పైగా పుట్టిన పిల్లలు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పిల్లల్లా ఉన్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై బాధితుడైన రాహుల్ రాథోడ్ ముందుగా ఐవీఎఫ్ సెంటర్‌‌ను ఆశ్రయించినా సరైన స్పందన రాలేదు. దీంతో ఆ జంట కోర్టును ఆశ్రయించింది. తమ బయోలాజికల్ పిల్లలు తమకు కావాలని, ఐవీఎఫ్ సంస్థకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన కోర్టు ఐవీఎఫ్ సెంటర్‌‌పై చర్యకు ఆదేశించింది. అక్కడి రికార్డుల్ని సీజ్ చేయాలంది. ప్రస్తుతం ఈ అంశంపై ఇంకా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో దేశంలో కొనసాగుతున్న ఐవీఎఫ్ సెంటర్ల నిర్వహణా తీరుపై, నైతికతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్‌నెస్..!

శ్రేయస్ అయ్యర్‌ ఇంటి అద్దె రూ.7.14 కోట్లు

అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!

12 రోజుల పాటు కదలని ట్రాఫిక్‌ జామ్‌.. ఎక్కడ? ఎప్పుడు?

అతిగా ఎలక్ట్రోలైట్లు తాగుతున్నారా? మీ కిడ్నీలు సెడ్డుకే.. !

Follow Us