12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?
2010లో చైనాలోని నేషనల్ హైవే-110పై ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 100 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా, కొందరు డ్రైవర్లు ట్రాఫిక్ నుంచి బయటపడేందుకు 12 రోజులు వేచి చూడాల్సి వచ్చింది. హైవే పక్కన తాత్కాలిక దుకాణాలు వెలిసిపోవడంతో ఆ మార్గం ఓ చిన్న పట్టణంలా మారిపోయింది. ఈ ఘటన ప్రపంచ చరిత్రలోనే అత్యంత భారీ ట్రాఫిక్ జామ్‌లలో ఒకటిగా నిలిచింది.
హైదరాబాద్‌లో వర్షం మొదలైతే చాలు.. రోడ్లన్నీ చెరువుల్లా మారిపోతాయి. బెంగళూరులో అయితే ట్రాఫిక్‌లో చిక్కుకోవడం ప్రతి రోజు అక్కడివారికి అనుభవమే. అరగంట, గంట ట్రాఫిక్‌లో నిలిచిపోతేనే చిరాకు పీక్ స్థాయికి చేరుకుంటుంది. అలాంటిది ఒకసారి బండి స్టార్ట్ చేసి రోడ్డెక్కిన తర్వాత 12 రోజుల పాటు ట్రాఫిక్‌లోనే చిక్కుకుపోతే? కారు, ట్రక్కుల్లోనే తిని, పడుకొని, రోజులు గడపాల్సి వస్తే? వినడానికి సినిమా కథలా అనిపించినా.. 2010లో చైనాలో అది నిజంగానే జరిగింది. చైనాలోని ఇన్నర్ మంగోలియాను బీజింగ్‌తో కలిపే నేషనల్ హైవే-110పై ఈ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 100 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా బొగ్గు, నిర్మాణ సామగ్రిని తరలించే ట్రక్కుల సంఖ్య ఒక్కసారిగా పెరగడం, మరోవైపు రోడ్డు మరమ్మతు పనులు కొనసాగడం వల్ల హైవేపై వాహనాల సంఖ్య పెరిగింది. అప్పటికే ఆ మార్గంలో ట్రాఫిక్ ప్రతి ఏడాది సుమారు 40 శాతం చొప్పున పెరుగుతుండటంతో పరిస్థితి మరింత దిగజారింది. మొదట్లో వాహనదారులు ఆగ్రహంతో హారన్లు మోగిస్తూ, అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. అయితే గంటలు రోజులు కావడంతో పరిస్థితిని అంగీకరించక తప్పలేదు. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు రోజుకు కేవలం ఒక కిలోమీటర్ మాత్రమే ముందుకు కదిలాయి. కొందరు డ్రైవర్లు ట్రాఫిక్ నుంచి బయటపడటానికి దాదాపు 12 రోజులు పట్టింది. ట్రాఫిక్ జామ్ కొనసాగుతుండటంతో స్థానిక గ్రామస్తులు దీనిని వ్యాపార అవకాశంగా మార్చుకున్నారు. హైవే పక్కనే తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసి నీరు, నూడుల్స్, సిగరెట్లు, స్నాక్స్ విక్రయించడం ప్రారంభించారు. ఇదే అదనుగా రేట్లు పెంచేసి విక్రయించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో హైవే ఒక తాత్కాలిక పట్టణంలా మారిపోయింది. వాహనాల్లోనే నిద్రపోవడం, ట్రక్కుల మధ్య నడుచుకుంటూ తిరగడం, ఆహారం కోసం వరుసల్లో నిలబడటం వంటి దృశ్యాలు కనిపించాయి. చివరకు ట్రక్కుల రాకపోకలపై ప్రత్యేక నియంత్రణలు అమలు చేయడంతో పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అతిగా ఎలక్ట్రోలైట్లు తాగుతున్నారా? మీ కిడ్నీలు సెడ్డుకే.. !
క్లీనర్, కార్ వాషర్‌గా చిన్నా చితకా పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?
క్లీనర్, కార్ వాషర్‌గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..
చనిపోయిన భార్యపై ప్రేమకు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ
ఫేస్బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..

