AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ

అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ

Phani CH
|

Updated on: Jun 16, 2026 | 3:22 PM

Share

భారత్‌లో 1981-1996 మధ్య జన్మించిన మిలీనియల్స్ కొత్త రుణాల విషయంలో ముందంజలో ఉన్నారని బ్యాంక్‌బజార్ సర్వే వెల్లడించింది. వ్యక్తిగత, గృహ, వాహన రుణాల్లో వీరి వాటా అధికంగా ఉంది. సులభమైన ఈఎంఐలు, డిజిటల్ లెండింగ్ వేదికలు రుణాల వినియోగాన్ని పెంచుతున్నాయి. మరోవైపు జెన్-జీ కూడా క్రెడిట్ కార్డులు, చిన్న రుణాలపై ఆసక్తి చూపుతుండగా, యువతలో పెరుగుతున్న రుణభారంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మనదేశంలో మిలీనియల్స్.. అంటే 1981 నుంచి 1996 మధ్య పుట్టిన వారు అత్యధికంగా రుణాలు తీసుకుంటున్నారని బాంక్‌ బజార్‌ సర్వే తేల్చి చెప్పింది. 2025 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో కొత్తగా రుణాలు తీసుకున్న వారిలో మిలీనియల్స్ వాటా 55 శాతంగా ఉంది. వీరి తర్వాత జెన్-జీ, పాత తరం వారు ఉన్నారు. వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, వాహన రుణాలలో మిలీనియల్స్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అత్యధిక క్రెడిట్ కార్డులు, కార్ లోన్లు వీరి పేరు మీదే ఉన్నాయని తేలింది. డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌లు, సులభమైన ఈఎంఐలు, అప్పుల పట్ల దృక్పథాన్ని మార్చేస్తున్నాయి. మిలీనియల్స్ తమ కెరీర్‌లో స్థిరపడటం, కుటుంబాలను ప్రారంభించడం, సొంత ఇల్లు కొనుక్కోవడం ఈ ధోరణికి కారణాలు. నగరాల్లో ఆకాశాన్నంటుతున్న ఆస్తుల ధరల వల్ల, డబ్బు ఆదా చేసి ఇల్లు కొనడం చాలామందికి అసాధ్యంగా మారింది. దీంతో వారు తమ లక్ష్యాలను త్వరగా చేరుకోవడానికి రుణాలను ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారు. మిలీనియల్స్ ఈఎంఐలను చివరి అస్త్రంగా కాకుండా ఒక సాధారణ ఆర్థిక సాధనంగా పరిగణిస్తున్నారని నిపుణులు అంటున్నారు. పొదుపు చేసి కొనుక్కోవాలనే పాత తరం ఆలోచన నుంచి, రుణం తీసుకుని అవసరాలు తీర్చుకోవాలనే మార్పు వీరిలో కనిపిస్తోందని ఆయన అన్నారు. ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లోకి వస్తున్న యువ తరం జెన్-జీ కూడా క్రెడిట్ వినియోగంపై ఆసక్తి చూపుతోంది. తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ, చిన్న మొత్తంలో వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులను వీరు ఎక్కువగా తీసుకుంటున్నారు. ఆశ్చర్యకరంగా, మిగతా తరాలతో పోలిస్తే జెన్-జీలో రుణాల చెల్లింపు ఒత్తిడి చాలా తక్కువగా ఉందని బ్యాంక్‌బజార్ డేటా సూచిస్తోంది. అయితే, ప్రస్తుతానికి చిన్న మొత్తంలో రుణాలు తీసుకోవడం వల్ల వీరి క్రెడిట్ హిస్టరీ బాగుందని, భవిష్యత్తులో పెద్ద మొత్తంలో గృహ రుణాలు వంటివి తీసుకున్నప్పుడు వీరి ప్రవర్తన ఎలా ఉంటుందో అప్పుడే అంచనా వేయగలమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి భిన్నంగా పాత తరం వారు తమ వద్ద ఉన్న ఆస్తులపైనే రుణాలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. గోల్డ్ లోన్లు, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రుణాలు తీసుకోవడం ద్వారా తక్కువ వడ్డీకే నిధులు సమకూర్చుకుంటున్నారు. ఈ విధానం వల్ల తమ సంపదను కాపాడుకుంటూనే, ఆర్థిక అవసరాలు తీర్చుకోగలుగుతున్నారు. రాబోయే దశాబ్ద కాలంలో జెన్-జీ ఆదాయాలు పెరిగేకొద్దీ, రిటైల్ రుణాల వృద్ధికి వారే ముఖ్యులుగా మారతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ముఖ్యంగా యువతలో అధిక రుణభారంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది.. దేశవ్యాప్తంగా రగిలిన వివాదం!

రోజుకు 200 లీటర్లే.. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు

హైదరాబాద్ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ షేర్లు కొనొచ్చా?

చ‌నిపోయిన భార్య‌పై ప్రేమ‌కు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ

ఫేస్‌బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..

Follow Us