హైదరాబాద్ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ షేర్లు కొనొచ్చా?
Elon Musk నేతృత్వంలోని SpaceX ఐపీవో భారీ విజయాన్ని నమోదు చేసింది. కంపెనీ మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్ల స్థాయిని దాటగా, మస్క్ ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా నిలిచాడు. విదేశీ ఐపీవోల్లో భారతీయులు ఎలా పెట్టుబడి పెట్టవచ్చో, ఎల్‌ఆర్‌ఎస్ నిబంధనలు, కరెన్సీ రిస్క్‌లు, పన్ను అంశాలపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది.
ఎలాన్ మస్క్.. భూ మండలంపైనే ఫస్ట్ ట్రిలియనీర్ గా అవతరించాడు. లక్ష కోట్ల రూపాయల వ్యక్తిగత ఆస్తులతో చరిత్ర సృష్టించాడు. 2026, జూన్ 12వ తేదీన ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యింది. ఐపీవో అంచనాలను మించి సక్సెస్ అయ్యింది. ఒక్కో షేరును 135 డాలర్లుగా నిర్ణయించి మొత్తం 555 మిలియన్ షేర్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ద్వారా 75 బిలియన్ డాలర్లను సమీకరించింది. స్పేస్ ఎక్స్ షేర్లకు నాలుగు రెట్లు డిమాండ్ ఎక్కువ వచ్చింది. నాస్‌డాక్‌లో ప్రారంభ ట్రేడింగ్ సమయంలో స్పేస్ ఎక్స్ కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా 1.77 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఉద్యోగులకు ఇచ్చిన స్టాక్స్, ఇతర వాటా యూనిట్లను పరిగణలోకి తీసుకుంటే దాని విలువ 1.80 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. రాకెట్ ప్రయోగాలు, శాటిలైట్ బ్రాడ్ బ్రాండ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష పరిశోధనలతో స్పేస్ ఎక్స్ దూసుకెళ్తుంది. ఎలాన్ మస్క్ ఆలోచనలకు పెట్టుబడిదారులు మరింత విశ్వాసంగా ఉండటం కలిసొచ్చింది. స్పేస్ ఎక్స్ ఐపీవోకు వచ్చిన స్పందన చూసిన తర్వాత.. రాబోయే ఓపెన్ AI, ఆంథ్రోపిక్ ఐపీవోలపై భారీ అంచనాలు పెరిగాయి. ఆ రెండు కంపెనీలు సైతం ట్రిలియన్ డాలర్ల విలువను చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. స్పేస్ ఎక్స్ ఐపీఓను తీవ్రంగా వ్యతిరేకిస్తూ అమెరికాలోని పలు నగరాల్లో ఆందోళనలు జరిగాయి. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్, వాల్ స్ట్రీట్ , జేపీ మోర్గాన్ కార్యాలయం ఎదుట ‘స్టాప్ ఫండింగ్ బిలియనీర్స్’ కూటమి నేతృత్వంలోని కార్మిక సంఘాలు ఈ నిరసనలు చేపట్టాయి. ఈ వ్యతిరేకతకు ముఖ్య కారణం ఉద్యోగుల పెన్షన్ నిధులు రిస్క్ లో పడటమే.శ్రామికుల రిటైర్మెంట్ ఫండ్స్, పెన్షన్ డబ్బులను స్పేస్ ఎక్స్ వంటి భారీ మార్కెట్ క్యాప్ గల హై-రిస్క్ కంపెనీల్లో మదుపు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. అమెరికా రాజకీయాల్లో ఎలాన్ మస్క్ జోక్యాన్ని ప్రభుత్వ కాంట్రాక్టులకు ముడిపెడుతూ, సంపన్నులు లబ్ధి పొందే ప్రక్రియగా నిరసనకారులు ఆరోపించారు. ‘గ్రోక్’ ఏఐ చాట్‌బాట్ మైనర్లకు సంబంధించిన అభ్యంతరకర ఫొటోలను, కంటెంట్‌ను అనుమతిస్తోందనే ఆరోపణలకు నిరసనగా ఎలాన్ మస్క్ భారీ సైజు దిష్టిబొమ్మలను నిరసనకారులు ప్రదర్శించారు. సామాన్య ప్రజలు ద్రవ్యోల్బణంతో అల్లాడుతుంటే, ఎలాన్ మస్క్ మాత్రం ఈ ఐపీఓ ద్వారా మరింత సంపదను కూడబెట్టడం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇండియాలో ఇప్పటివరకు హ్యుందాయ్ మోటార్ ఇండియా అతిపెద్ద ఐపీఓగా ఉంది. ఇది రూ. 27 వేల కోట్లకు పైగా నిధుల్ని సమీకరించగా.. ఆ తర్వాత స్థానంలో ఎల్ఐసీ ఉంది. ఇక ఇప్పుడు 2026లో జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఐపీఓతో ఆ రికార్డుల్ని బద్ధలుకొట్టే అవకాశాలు ఉన్నాయి. భారత్‌లో కూడా చాలా మంది స్పేస్ ఎక్స్ ఐపీవోలో పెట్టుబడి పెట్టాలని ఆసక్తి చూపారు. స్పేస్ ఎక్స్ ప్రపంచంలోనే అత్యంత విలువైన లిస్ట్ అయిన కంపెనీల్లో ఒకటిగా మారింది. మరి హైదరాబాద్‌లో ఉంటూ అమెరికాలో స్పేస్ ఎక్స్ షేర్లు కొనొచ్చా అనే డౌట్ ఇన్వెస్టర్లలో ఉంది. భారతీయులు ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే అవును అనే చెప్పాలి. కానీ కొన్ని పరిమితులు ఉన్నాయి. భారత నియమాల ప్రకారం విదేశీ షేర్లు, విదేశీ ఐపీవోల్లో పెట్టుబడి పెట్టడాన్ని నిషేధించవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్‌ఆర్‌ఎస్ అంటే లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ప్రకారం ప్రతి సంవత్సరం ఒక వ్యక్తి 2,50,000 డాలర్ల వరకు విదేశీ పెట్టుబడుల కోసం పంపించవచ్చు. కానీ భారతీయ స్టాక్ బ్రోకింగ్ యాప్స్ ద్వారా నేరుగా స్పేస్‌ఎక్స్ ఐపీవోలో దరఖాస్తు చేయడం సాధ్యం కాదు. భారత ఐపీవోల్లో చేసేలా ఇక్కడ చేయలేరు. దానికి బదులుగా యూఎస్ ఐపీవోల్లో పాల్గొనడానికి అనుమతి ఇచ్చే అంతర్జాతీయ బ్రోకరేజ్ ఖాతా అవసరం. స్పేస్‌ఎక్స్ కొంతమంది ఎంపిక చేసిన బ్రోకరేజ్ సంస్థలను రిటైల్ పెట్టుబడిదారుల కోసం కేటాయింపు ఛానెల్స్‌గా నియమించింది. భారత పెట్టుబడిదారులకు ప్రధానంగా మూడు మార్గాలు ఉన్నాయి. యూఎస్ మార్కెట్లలో షేర్లు కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చే బ్రోకర్ల వద్ద ఖాతా తెరవవచ్చు. ఎల్‌ఆర్‌ఎస్ నియమాల ప్రకారం డబ్బు విదేశాలకు పంపి అక్కడ షేర్ల కోసం దరఖాస్తు చేయాలి. భారత పెట్టుబడిదారులు ఉపయోగించే కొన్ని ప్లాట్‌ఫారాలు ఇండ్ మనీ, వెస్టెడ్ ఫైనాన్స్, ఇంటరాక్టివ్ బ్రోకర్స్. కానీ ఐపీవోలో పాల్గొనడం పూర్తిగా బ్రోకర్ నియమాలు, అర్హతపై ఆధారపడి ఉంటుంది. భారతీయ పెట్టుబడిదారులకు కరెన్సీ రిస్క్ ఉంటుందనీ అమెరికన్ డాలర్, భారతీయ రూపాయి మార్పులు పెట్టుబడి రాబడులపై గణనీయమైన ప్రభావం చూపుతాయనీ నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు, స్పేస్‌ఎక్స్ షేర్లు 10% పెరిగినా, అదే సమయంలో రూపాయి విలువ పెరిగితే, ఆ లాభం భారతీయ పెట్టుబడిదారులకు తగ్గిపోవచ్చు. మరోవైపు, రూపాయి విలువ తగ్గితే, పెట్టుబడిదారులకు అదనపు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. పన్నుల పరంగా కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టే భారత నివాసితులు డివిడెండ్లపై అమెరికా ప్రభుత్వం విధించే విత్‌హోల్డింగ్ ట్యాక్స్‌ని పరిగణలోకి తీసుకోవాలి. అలాగే భారతదేశంలో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా వర్తిస్తుంది. అంతేకాకుండా విదేశీ ఆస్తుల వివరాలను భారత ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో తప్పనిసరిగా వెల్లడించాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా LRS నిబంధనలకు అనుగుణంగా డబ్బు విదేశాలకు పంపడం కూడా తప్పనిసరి. మొత్తంగా చూస్తే, విదేశీ పెట్టుబడుల్లో కరెన్సీ రిస్క్‌తో పాటు పన్ను సంబంధిత అంశాలను పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా అవసరం అని నిపుణులు అంటున్నారు. ఈ ఐపీవోకు డిమాండ్ అందుబాటులో ఉన్న షేర్ల కంటే ఎక్కువగా ఉంది. రిటైల్ పెట్టుబడిదారుల కోసం సుమారు 30 శాతం షేర్లు కేటాయించినట్లు సమాచారం ఉన్నా, పెద్ద భాగం సాధారణంగా ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకే వెళ్తుంది. విదేశీ రిటైల్ పెట్టుబడిదారులకు అదనపు పరిమితులు, తక్కువ కేటాయింపు అవకాశాలు ఉండొచ్చు. అయితే ఐపీవోలో పాల్గొనకపోయినా పెట్టుబడి అవకాశం కోల్పోయినట్లు కాదు. లిస్టింగ్ తర్వాత స్పేస్‌ఎక్స్ షేర్లు ఇతర యూఎస్ షేర్లలాగే కొనుగోలు చేయవచ్చు. భవిష్యత్తులో కంపెనీ నాస్‌డాక్-100 వంటి సూచీల్లో చేరితే ఆ సూచీలను ట్రాక్ చేసే ఫండ్స్ ద్వారా పరోక్ష పెట్టుబడి అవకాశం కూడా ఉండొచ్చు. కంపెనీ విలువ ట్రైలింగ్ సేల్స్ కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంది. కంపెనీ త్వరలో లాభదాయకం అవుతుందని కూడా చెప్పడం లేదు. రాకెట్ లాంచ్‌లు, శాటిలైట్ ప్రయోగాలు, ప్రభుత్వ నియమాలు వంటి అంశాలు పనితీరుపై పెద్ద ప్రభావం చూపుతాయి. కంపెనీ గవర్నెన్స్ నిర్మాణంపై కూడా ఆందోళనలు ఉన్నాయి. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం ఈ ఐపీవో తర్వాత ఎలాన్ మస్క్‌కు 80 శాతానికి పైగా ఓటింగ్ హక్కులు ఉంటాయి. దీని వల్ల కంపెనీ నిర్ణయాలపై అతని నియంత్రణ చాలా ఎక్కువగా ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చనిపోయిన భార్యపై ప్రేమకు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ
ఫేస్‌బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..
పొలంలో పనులు చేసుకుంటున్న రైతు.. అకస్మాత్తుగా కనిపించిన అరుదైన దృశ్యం చూసి..
బలపడుతున్న రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల భారీ వర్ష సూచన
రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా.. 4,400 మంది సాధారణ ఉద్యోగులు!
చనిపోయిన భార్యపై ప్రేమకు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ
ఫేస్‌బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..
పొలంలో పనులు చేసుకుంటున్న రైతు.. కనిపించిన అరుదైన దృశ్యం చూసి
రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా.. 4,400 మంది సాధారణ ఉద్యోగులు!
వణికిస్తున్న ప్రాణాంతక ఈగ.. పశువుల మాంసాన్నే తింటూ విస్తరణ
అమెరికా నుంచి భారత్ కు అందుకే వచ్చా!
పోలీసుల నుంచి తప్పించుకోబోయి.. మొసలి నోటికి చిక్కాడు..

