భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఐదో తరగతి విద్యార్థి శ్యామ్ అసాధారణ గణిత ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు. సాధారణంగా ఎవరికీ సాధ్యం కాని 1897 వంటి పెద్ద ఎక్కాలను టకటకా అప్పచెప్పడమే కాకుండా, పెద్ద సంఖ్యలతో గుణకారాలు, భాగాహారాలు అవలీలగా చేస్తున్నాడు. ఉపాధ్యాయులు సైతం అబ్బురపడుతున్న ఈ చిన్నారిని లెక్కల క్యాలెక్యులేటర్ అని పిలుస్తున్నారు.