AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గేరు మార్చిన టాప్‌ స్టార్స్‌.. స్పీడు కంటిన్యూ అవుతుందా?

గేరు మార్చిన టాప్‌ స్టార్స్‌.. స్పీడు కంటిన్యూ అవుతుందా?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Aug 14, 2026 | 7:21 PM

Share

ఒకప్పుడు ఏడాదికి ఒక్క సినిమా చేయడమే సాధ్యమయ్యేది. ఇప్పుడు టాలీవుడ్‌ అగ్ర హీరోలు వరుస సినిమాలతో స్పీడ్ పెంచుతున్నారు. చిరంజీవి, ప్రభాస్, వెంకటేష్, రవితేజతో పాటు యువ హీరోలు కూడా షార్ట్‌ గ్యాప్‌లో సినిమాలను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పక్కా షెడ్యూల్స్‌తో ఒక సినిమా తర్వాత మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దీంతో టాలీవుడ్‌లో బ్యాక్‌ టు బ్యాక్‌ రిలీజ్‌ల ట్రెండ్ ఊపందుకుంటోంది. బాక్సాఫీస్‌ వద్ద పోటీ మరింత ఆసక్తికరంగా మారుతోంది.

ఈ మధ్య ఏడాదికి ఒక సినిమా చేయడమే గగనం అన్నట్టుగా సాగిన అగ్ర హీరోల జర్నీ ఇప్పుడు మారుతోంది. ప్రేక్షకులకు ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ మీద దండయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. పక్కా ప్లానింగ్‌తో ఒకటికి రెండు సినిమాలను క్యూలో పెట్టి గేరు మార్చి మరీ జోరు చూపిస్తున్నారు. విరామం లేకుండా షార్ట్ గ్యాప్‌లోనే వరుస రిలీజ్‌లతో ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు. అదే జోష్‌లో దసరాకి ‘విశ్వంభర’తో సందడి చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఆ వెంటనే డైరెక్టర్ బాబీతో చేస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2027 సంక్రాంతి బరిలో దించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా పూర్తిచేసి.. నెలల గ్యాప్‌లోనే మరో సినిమాతో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయబోతున్నారు చిరు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తే బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే. ఈ ఏడాది ‘ది రాజాసాబ్’ తో పలకరించిన డార్లింగ్.. డిసెంబర్‌లో ‘ఫౌజీ’ సినిమాతో 2026కి గ్రాండ్‌గా సెండాఫ్ ఇవ్వడానికి ప్లాన్ చేశారు. ఆ వెంటనే ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా.. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’‌ను కూడా మార్చిలో రిలీజ్ చేసేలా పక్కా టార్గెట్ సెట్ చేసుకున్నారు. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఈ రేసులో ఏమాత్రం తగ్గడం లేదు. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం 47’ అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే తన లక్కీ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో కల్యాణ్ రామ్‌తో కలిసి చేస్తున్న మల్టీస్టారర్‌ను పట్టాలెక్కించారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. మాస్ మహారాజా రవితేజ ఎప్పటిలాగే తన స్పీడ్ కంటిన్యూ చేస్తున్నారు. సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ తో సక్సెస్ అందుకున్న ఆయన.. ఇప్పుడు ‘ఇరుముడి’ సినిమాతో సిద్ధమవుతున్నారు. ఆ వెంటనే హసిత్ గోలి డైరెక్షన్‌లో శ్రీవిష్ణుతో కలిసి నటిస్తున్న కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను కూడా జనవరి టార్గెట్‌గా బరిలోకి దించుతున్నారు. వీళ్లే కాదు.. టాలీవుడ్ యంగ్ జనరేషన్ హీరోలు కూడా ఇదే రూటు ఫాలో అవుతున్నారు. శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ హిట్ తర్వాత.. ‘భోగి’ సినిమాతో పాటు శ్రీనువైట్ల మూవీని చకచకా పూర్తిచేస్తున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా ‘రణబాలి’ మూవీని నవంబర్‌లో, ‘రౌడీ జనార్ధన’ను సమ్మర్‌లో రిలీజ్ చేసేలా ప్లాన్ మార్చారు. ఇలా టాప్ హీరోలంతా ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా స్పీడ్ పెంచడంతో ఇండస్ట్రీలో కొత్త వైబ్ కనిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Shraddha Srinath: మూడు భాషల్లో హిట్లు.. అయినా అవకాశాలు కరువు! శ్రద్ధా శ్రీనాథ్ కెరీర్‌కు ఏమైంది?

Ritika Nayak: వరుస హిట్లతో టాలీవుడ్‌లో గోల్డెన్ హ్యాండ్‌గా మారిన యంగ్ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Dhurandhar: థియేటర్లలో వేల కోట్లు.. ఇప్పుడు ఓటీటీలోనూ వరల్డ్ రికార్డ్! ‘ధురంధర్’ దుమ్మురేపుతోంది

పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!

ఈ చిన్నారి చిచ్చరపిడుగు.. ఏకంగా విమానాన్నే రద్దు చేయించింది!

Follow Us