Shraddha Srinath: మూడు భాషల్లో హిట్లు.. అయినా అవకాశాలు కరువు! శ్రద్ధా శ్రీనాథ్ కెరీర్‌కు ఏమైంది?
కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా శ్రీనాథ్‌కు ప్రస్తుతం అవకాశాలు ఆశించిన స్థాయిలో రావడం లేదని కథనం చెబుతోంది. కెరీర్ ప్రారంభంలో పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వడంతో కమర్షియల్ ఇమేజ్ దూరమైందని తెలుస్తోంది. ఇటీవల గ్లామర్ పాత్రల వైపు అడుగులు వేసినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదని సమాచారం. ప్రస్తుతం తమిళ చిత్రం ‘బ్రో కోడ్’ ఒక్కటే ఆమె చేతిలో ఉన్నట్లు కథనం పేర్కొంది.
నటిగా మంచి పేరు, మూడు భాషల్లో హిట్స్ ఇచ్చిన రికార్డ్ ఉన్నా… ఓ బ్యూటీకి అవకాశాలు మాత్రం రావటం లేదు. కెరీర్ స్టార్టింగ్‌లో పెట్టిన కొన్ని కండిషన్స్ ఈ బ్యూటీని ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో ఇమేజ్ను మార్చే మంచి ఆఫర్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు ఆ బ్యూటీ. కన్నడ సినిమా యూటర్న్‌తో మంచి పేరు తెచ్చుకున్న శ్రద్దా శ్రీనాథ్ తరువాత తెలుగు, తమిళ భాషల్లోనూ హిట్ సినిమాల్లో నటించారు. అయినా ఈ బ్యూటీకి స్టార్ ఇమేజ్ మాత్రం రాలేదు. క్రేజీ ప్రాజెక్ట్స్‌లో టాప్ హీరోలతో జోడీ కట్టినా ఆశించిన స్థాయిలో అవకాశాలు రావటం లేదు. కెరీర్ స్టార్టింగ్‌లో ఎక్కువగా పెర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్స్‌కే ఓకే చెప్పిన ఈ బ్యూటీ గ్లామర్ ఇమేజ్‌కు దూరమయ్యారు. దీంతో కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. ఆ విషయం గ్రహించి గ్లామర్ టర్న్ తీసుకునే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొద్ది రోజులుగా శ్రద్దా గ్లామర్ రోల్స్ లోనూ నటిస్తున్నా… కెరీర్లో స్పీడు మాత్రం కనిపించటం లేదు. గత ఏడాది డాకూ మహరాజ్, కలియుగం 2064, ఆర్యన్ సినిమాల్లో నటించారు ఈ బ్యూటీ. ఈ సినిమాలేవి అమ్మడి కెరీర్‌కు హెల్ప్ అవ్వలేదు. ప్రజెంట్ తమిళంలో బ్రో కోడ్ సినిమాలో నటిస్తున్నారు శ్రద్ధా.. ఆ మూవీ తప్ప మరే ప్రాజెక్ట్ అమ్మడి కిట్టీలో లేదు. ఎలాగైనా కెరీర్ స్పీడు పెంచేందుకు కష్టపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ritika Nayak: వరుస హిట్లతో టాలీవుడ్లో గోల్డెన్ హ్యాండ్‌గా మారిన యంగ్ బ్యూటీ.. ఎవరో తెలుసా?
Dhurandhar: థియేటర్లలో వేల కోట్లు.. ఇప్పుడు ఓటీటీలోనూ వరల్డ్ రికార్డ్! ‘ధురంధర్’ దుమ్మురేపుతోంది
పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!
ఈ చిన్నారి చిచ్చరపిడుగు.. ఏకంగా విమానాన్నే రద్దు చేయించింది!
కడుపు నిండా తింటూనే బరువు తగ్గొచ్చు.. ట్రెండింగ్‌లో ‘వాల్యూమెట్రిక్స్ డైట్’!
పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!
ఈ చిన్నారి చిచ్చరపిడుగు.. ఏకంగా విమానాన్నే రద్దు చేయించింది!
Gen Z ప్రేమలో వినిపించే ఈ డేటింగ్ పదాల అసలు అర్థాలివే!
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!

