కడుపు నిండా తింటూనే బరువు తగ్గొచ్చు.. ట్రెండింగ్‌లో ‘వాల్యూమెట్రిక్స్ డైట్’!
భోజనం తర్వాత పండ్లు తింటే కడుపులో కుళ్లిపోతాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. కడుపులోని ఆమ్ల వాతావరణంలో పండ్లు కుళ్లిపోవడం సాధ్యం కాదని వివరిస్తున్నారు. పండ్లలోని పీచు జీర్ణక్రియను కొద్దిగా నెమ్మదింపజేసినా అది సహజ ప్రక్రియే. అయితే ఐబీఎస్ లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారికి భోజనం వెంటనే పండ్లు తింటే ఉబ్బరం కలగవచ్చని సూచిస్తున్నారు.
ప్రస్తుత కాలంలో బరువు తగ్గాలని చాలామంది డైట్ పేరుతో పూర్తిగా ఆహారం తీసుకోవడం మానేస్తుంటారు. అంతేకాకుండా రకరకాల డైట్లను అనుసరిస్తుంటారు. అయితే నచ్చిన ఆహారాన్ని పూర్తిగా తినడం మానేయకుండానే సులభంగా బరువు తగ్గేందుకు ఓ డైట్ బాగా ట్రెండవుతోంది. అదే.. వాల్యూమెట్రిక్స్ డైట్. ప్రముఖ పోషకాహార నిపుణులు డెవలప్ చేసిన ఈ డైట్‌లో తక్కువ కేలరీలు, ఎక్కువ నీరు లేదా పీచు పదార్థాలు ఉన్న ఆహారాలకు ప్రాధాన్యత ఇస్తారు. పండ్లు, కూరగాయలు, సూప్‌లు వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలిగి ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఈ వాల్యూమెట్రిక్స్ డైట్‌లో ఆహారాలను నాలుగు వర్గాలుగా విభజించారు. మొదటి గ్రూప్‌లో పిండి పదార్థాలు తక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, కొవ్వు లేని పాలు ఉంటాయి. రెండో గ్రూపులో పిండి పదార్థాలు ఉండే పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, బ్రేక్‌ఫాస్ట్ సీరియల్స్, తక్కువ కొవ్వు మాంసం, పప్పుధాన్యాలు వంటి ఆహారాలు ఉంటాయి. మూడో గ్రూప్‌లో చీజ్, ఫ్రెంచ్ ఫ్రైస్, కేకులు, బ్రెడ్ వంటివి ఉండగా, నాలుగో గ్రూప్‌లో చిప్స్, చాక్లెట్లు, వెన్న, నూనెలు వంటి అధిక కేలరీలు ఉండే ఆహారాలు ఉంటాయి. ఈ డైట్‌లో మొదటి రెండు గ్రూప్‌లకు చెందిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. మూడో గ్రూప్‌ను పరిమితంగా తీసుకోవాలి. ఇక నాలుగో గ్రూప్‌ను చాలా తక్కువగా తీసుకోవాలని సూచిస్తారు. ఒక పరిశోధనలో 97 మంది ఊబకాయం ఉన్న మహిళలపై అధ్యయనం చేయగా, పండ్లు, కూరగాయలతో కూడిన తక్కువ కేలరీల ఆహారం తీసుకున్నవారు ఏడాదిలో సుమారు 14 పౌండ్ల బరువు తగ్గినట్లు తేలింది. ఈ డైట్ విధానంలో కేవలం ఆహారమే కాకుండా వ్యాయామానికి కూడా ప్రాముఖ్యత ఉంది. రోజుకు 30 నుండి 60 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యకరంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏ డైట్ ప్రారంభించాలన్నా వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి నిపుణుల సలహా తీసుకోవాలి. వారు సూచించిన డైట్ నే ఫాలో అవ్వాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భోజనం చేసిన వెంటనే పండ్లు తినొచ్చా? నిపుణులు చెబుతున్న అసలు నిజం ఇదే!
Gen Z ప్రేమలో వినిపించే ఈ డేటింగ్ పదాల అసలు అర్థాలివే!
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు

