భోజనం చేసిన వెంటనే పండ్లు తినొచ్చా? నిపుణులు చెబుతున్న అసలు నిజం ఇదే!
భోజనం తర్వాత పండ్లు తింటే కడుపులో కుళ్లిపోతాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. కడుపులోని ఆమ్ల వాతావరణంలో పండ్లు కుళ్లిపోవడం సాధ్యం కాదని వివరిస్తున్నారు. పండ్లలోని పీచు జీర్ణక్రియను కొద్దిగా నెమ్మదింపజేసినా అది సహజ ప్రక్రియే. అయితే ఐబీఎస్ లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారికి భోజనం వెంటనే పండ్లు తింటే ఉబ్బరం కలగవచ్చని సూచిస్తున్నారు.
భోజనం పూర్తయిన వెంటనే చాలామంది పండ్లు తింటూ ఉంటారు. గతంలో భోజనం తర్వాత స్వీటు తినేవారు.. ఇప్పుడు పండ్లు తింటున్నారు. భోజనం చేసిన తర్వాత ఏదైనా పండు తింటే ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఓప్రచారం జోరుగా సాగుతోంది. అదేంటంటే.. భోజనం తర్వాత పండ్లు తింటే కడుపులో కుళ్లిపోతాయని, గ్యాస్ ఏర్పడి జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై ఆరోగ్య నిపుణులు స్పష్టతనిచ్చారు. ఈ ప్రచారానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తేల్చిచెప్పారు. మన కడుపులో ఆమ్లాల స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. అంతటి ఆమ్ల వాతావరణంలో పండ్లు కుళ్లిపోవడం లేదా పులిసిపోవడం సాధ్యం కాదని నిపుణులు వివరిస్తున్నారు. పండ్లలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను కొద్దిగా నెమ్మదింపజేయడం వల్ల ఆహారం కడుపులో కాసేపు ఎక్కువ సమయం ఉండవచ్చు. కానీ అది సహజమైన జీర్ణ ప్రక్రియలో భాగమే తప్ప ఆరోగ్యానికి హాని కలిగించదంటున్నారు. పైగా, ఇది రక్తంలో చక్కెర స్థాయులు ఒక్కసారిగా పెరగకుండా నిరోధిస్తూ, ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుందన్నారు. మధుమేహ బాధితులు సైతం ప్రోటీన్లు, కొవ్వులు ఉన్న ఆహారంతో పాటు పండ్లు తీసుకోవడం ప్రయోజనకరమేనని అధ్యయనాలు చెబుతున్నాయి. జామ, కివీ, నారింజ వంటి విటమిన్-సి ఎక్కువగా ఉండే పండ్లను భోజనంతో పాటు తీసుకుంటే శరీరం ఇనుమును మెరుగ్గా గ్రహిస్తుంది. అయితే, ఐబీఎస్ లేదా తీవ్రమైన జీర్ణ సమస్యలు ఉన్నవారికి భోజనం వెంటనే పండ్లు తింటే కడుపు ఉబ్బరం అనిపించవచ్చు. అలాంటి వారు భోజనానికి గంట లేదా రెండు గంటల తర్వాత పండ్లు తినడం మంచిదని సూచిస్తున్నారు. మొత్తానికి, చక్కెరతో నిండిన స్వీట్ల కంటే భోజనం తర్వాత పండ్లు తినడం మంచి ఎంపిక అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆహారపుటలవాట్లలో మార్పు చేయాలనుకుంటే.. వైద్యనిపుణులు సంప్రదించి వారి సలహాతోనే మార్చుకోవాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

