ఈ చిన్నారి చిచ్చరపిడుగు.. ఏకంగా విమానాన్నే రద్దు చేయించింది!
ఆహారాన్ని పూర్తిగా మానేయకుండా బరువు తగ్గాలనుకునేవారికి వాల్యూమెట్రిక్స్ డైట్ ఉపయోగకరమైన విధానంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. తక్కువ కేలరీలు, ఎక్కువ నీరు లేదా పీచు ఉన్న పండ్లు, కూరగాయలు, సూప్‌లకు ఇందులో ప్రాధాన్యత ఉంటుంది. ఆహారాలను నాలుగు గ్రూపులుగా విభజించి, మొదటి రెండు గ్రూప్‌లను ఎక్కువగా, మూడో గ్రూప్‌ను పరిమితంగా, నాలుగో గ్రూప్‌ను చాలా తక్కువగా తీసుకోవాలని సూచిస్తారు. వ్యాయామానికి కూడా ప్రాధాన్యత ఇస్తారు.
కెనడాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఒక చిన్నారి సీటు బెల్టు ధరించేందుకు నిరాకరించడంతో, ఏకంగా విమాన సర్వీసునే రద్దు చేయాల్సి వచ్చింది. భద్రతా నిబంధనలతో విమానం నిలిచిపోవడంతో తోటి ప్రయాణికులందరూ రాత్రంతా విమానాశ్రయంలోనే తీవ్ర అవస్థలు పడ్డారు. పోర్టర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం విక్టోరియా నుంచి టొరంటోకు బయలుదేరేందుకు సిద్ధమైంది. విమానం రన్‌వే వైపు వెళుతుండగా, ఒక చిన్నారి సీటుపై నిలబడి ఉండటాన్ని సిబ్బంది గమనించారు. తల్లిదండ్రులు, సిబ్బంది ఎంత నచ్చజెప్పినా ఆ పాప కూర్చుని బెల్టు ధరించేందుకు అంగీకరించలేదు. భద్రతా కారణాల రీత్యా పైలట్లు విమానాన్ని తిరిగి టెర్మినల్‌కు తీసుకెళ్లారు. ఆ చిన్నారి కుటుంబాన్ని లగేజీతో సహా కిందకు దించే క్రమంలో తీవ్ర జాప్యం జరిగింది. ఇంతలో సమయం రాత్రి 12:30 దాటింది. విక్టోరియా విమానాశ్రయంలో రాత్రి 12:30 గంటల తర్వాత రన్‌వే మూసివేస్తారు. దీంతో విమాన సర్వీసును రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో 132 మంది ప్రయాణికులు రాత్రంతా విమానాశ్రయంలోనే గడపాల్సి వచ్చింది. చిన్నారి ప్రయాణ భయం వల్లే అలా ప్రవర్తించి ఉండవచ్చని ప్రయాణికులు తెలిపారు. ఈ అసౌకర్యానికి క్షమాపణలు కోరిన ఎయిర్‌లైన్స్ యాజమాన్యం, మరుసటి రోజు ఉదయం ప్రయాణికులను వేరే విమానంలో టొరంటోకు చేర్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కడుపు నిండా తింటూనే బరువు తగ్గొచ్చు.. ట్రెండింగ్‌లో ‘వాల్యూమెట్రిక్స్ డైట్’!
భోజనం చేసిన వెంటనే పండ్లు తినొచ్చా? నిపుణులు చెబుతున్న అసలు నిజం ఇదే!
ఈ చిన్నారి చిచ్చరపిడుగు.. ఏకంగా విమానాన్నే రద్దు చేయించింది!
Gen Z ప్రేమలో వినిపించే ఈ డేటింగ్ పదాల అసలు అర్థాలివే!
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!

