AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar: థియేటర్లలో వేల కోట్లు.. ఇప్పుడు ఓటీటీలోనూ వరల్డ్ రికార్డ్! ‘ధురంధర్’ దుమ్మురేపుతోంది

Dhurandhar: థియేటర్లలో వేల కోట్లు.. ఇప్పుడు ఓటీటీలోనూ వరల్డ్ రికార్డ్! ‘ధురంధర్’ దుమ్మురేపుతోంది

Phani CH
|

Updated on: Aug 14, 2026 | 6:41 PM

Share

రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్’ సినిమా థియేటర్ల తర్వాత ఓటీటీలోనూ సంచలనం సృష్టిస్తోంది. 2026 జనవరి నుంచి జూన్ మధ్య ప్రపంచవ్యాప్తంగా 3.7 కోట్ల వ్యూస్ సాధించి అత్యధికంగా వీక్షించిన నాన్-ఇంగ్లిష్ సినిమాగా రికార్డు నెలకొల్పినట్లు సమాచారం. 22 దేశాల్లో టాప్ చార్టుల్లో నిలిచిన ఈ మూవీ, రెండు భాగాలతో కలిపి రూ.3,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు పేర్కొంటున్నారు.

బాలీవుడ్ నుంచి వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. థియేటర్లలో వేల కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ.. డిజిటల్‌ గ్లోబల్ రికార్డులను కూడా బద్దలు కొట్టేసింది. స్క్విడ్ గేమ్, మనీ హీస్ట్ లాంటి సిరీస్‌ల రేంజ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తూ.. ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెబుతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి ఓటీటీని ఎలా షేక్ చేస్తోంది. బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధురంధర్’.. నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో రికార్డులు సెట్ చేస్తోంది. కేవలం బాక్సాఫీస్ దగ్గరే కాదు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో కూడా అదే జోరు చూపిస్తోంది. రీసెంట్‌గా 2026 సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది చూసిన నాన్-ఇంగ్లిష్ సినిమాగా ఈ మూవీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో ‘ధురంధర్’ సినిమాకు ఓటీటీలో 3.7 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఎన్నో ఇంగ్లిష్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి.. ప్రపంచ వ్యాప్తంగా 22 దేశాల్లోని టాప్ చార్టుల్లో ఈ సినిమా ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఓటీటీ సంస్థ ప్రతినిథులు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. థియేట్రికల్‌ రన్‌లో ఆల్‌ టైమ్ రికార్డ్స్ సెట్ చేసింది ధురందర్‌. రెండు భాగాలు కలిపి వరల్డ్ వైడ్‌గా 3,100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ జనాలకు షాక్ ఇచ్చింది. ముఖ్యంగా సీక్వెల్‌గా వచ్చిన ‘ధురంధర్ ది రివెంజ్’ అరుదైన ఘనత సాధించింది. ఇండియాలోనే 1,000 కోట్ల నెట్ వసూళ్లు సాధించి.. ఈ ఫీట్ అచీవ్ చేసిన తొలి బాలీవుడ్ చిత్రంగా రికార్డ్ సెట్ చేసింది. 2025 డిసెంబరులో ‘ధురంధర్’ ఫస్ట్ పార్ట్ థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించగా.. పార్ట్ 2 రిలీజ్‌కు ముందు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యి గ్లోబల్ రీచ్ తెచ్చుకుంది. ఆ బజ్‌తో ఈ ఏడాది మార్చిలో వచ్చిన సీక్వెల్ ‘ధురంధర్ ది రివెంజ్’ బాక్సాఫీస్‌ను రికార్డులు బ్రేక్ చేయటమే కాదు.. ఓటీటీ రికార్డులను తిరగరాస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!

ఈ చిన్నారి చిచ్చరపిడుగు.. ఏకంగా విమానాన్నే రద్దు చేయించింది!

కడుపు నిండా తింటూనే బరువు తగ్గొచ్చు.. ట్రెండింగ్‌లో ‘వాల్యూమెట్రిక్స్‌ డైట్’!

భోజనం చేసిన వెంటనే పండ్లు తినొచ్చా? నిపుణులు చెబుతున్న అసలు నిజం ఇదే!

Gen Z ప్రేమలో వినిపించే ఈ డేటింగ్ పదాల అసలు అర్థాలివే!

Follow Us