AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా.. 4,400 మంది సాధారణ ఉద్యోగులు!

రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా.. 4,400 మంది సాధారణ ఉద్యోగులు!

Phani CH
|

Updated on: Jun 15, 2026 | 8:46 PM

Share

SpaceX ఐపీఓతో వేలాది మంది ఉద్యోగుల జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. కంపెనీ ఇచ్చిన షేర్ల విలువ భారీగా పెరగడంతో సుమారు 4,400 మంది ప్రస్తుత, మాజీ ఉద్యోగులు మిలియనీర్లుగా మారనున్నారు. ఇంజనీర్లతో పాటు క్యాంటీన్, క్లీనింగ్ సిబ్బంది కూడా కోటీశ్వరుల జాబితాలో చేరుతున్నారు. ఈ మెగా ఐపీఓతో Elon Musk సంపద కూడా కొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తోంది.

రాత్రికి రాత్రే అదృష్టం తలుపు తడితే ఎలా ఉంటుందో చెప్పడానికి లాటరీ టికెట్లే అవసరం లేదు, ఒక మంచి ఐడియా ఉన్న కంపెనీలో నమ్మకంగా పనిచేస్తే చాలు. నెలాఖరైతే జీతం కోసం ఎదురుచూసే సాధారణ ఆఫీస్ సిబ్బంది, క్యాంటీన్ వర్కర్లు, క్లీనింగ్ స్టాఫ్.. ఇప్పుడు ఒక్కసారిగా ఊహించని రీతిలో వందల కోట్ల అధిపతులుగా మారిపోయారు. కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఈ ‘వెల్త్ విప్లవం’తో వేలాది మంది మధ్యతరగతి ఉద్యోగుల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. ఈ కళ్లు చెదిరే అద్భుతానికి కారణం.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘స్పేస్‌ఎక్స్’ సంస్థ. చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ కి ఈ సంస్థ ఇప్పుడు సిద్ధమవుతోంది. నాస్‌డాక్ స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టబోతున్న ఈ మెగా ఐపీఓ ద్వారా కంపెనీలో పనిచేసే సుమారు 4,400 మంది సాధారణ ఉద్యోగులు ఒకేసారి మల్టీ-మిలియనీర్లు కాబోతున్నారు. స్పేస్‌ఎక్స్ కంపెనీ మొదటి నుంచి తమ ఉద్యోగులకు భారీ జీతాలు ఇవ్వడానికి బదులుగా.. కంపెనీ ఈక్విటీ షేర్లను ప్రోత్సాహకాలుగా ఇస్తూ వచ్చింది. గతంలో కేవలం 2 డాలర్లకే లభించిన ఈ షేర్ల విలువ ఇప్పుడు ఐపీఓ పుణ్యమా అని ఏకంగా 135 డాలర్లకి చేరింది. దీంతో కంపెనీలోని వైట్-కాలర్ ఇంజనీర్లతో పాటు క్యాంటీన్ కార్మికులు, క్లీనింగ్ స్టాఫ్, ఇతర సిబ్బంది కూడా కోటీశ్వరుల జాబితాలో చేరిపోతున్నారు. విశ్లేషకుల అంచనా ప్రకారం, సుమారు 400 మంది ఉద్యోగుల ఆస్తి విలువ ఏకంగా 100 మిలియన్‌ డాలర్లు అంటే రూ.956 కోట్లు దాటబోతోంది. ఓ సాధారణ ఇంజినీర్‌.. నేడు మిలియనీర్! షేర్ల మాయాజాలానికి 27 ఏళ్ల మేరీ ఎలిన్ ముస్సెల్మన్ కథే ఒక ఉదాహరణ. ఫ్లోరిడా తీరంలో రాకెట్ భాగాలను సేకరించే స్పేస్‌ఎక్స్ రికవరీ నౌకలో ఆమె ఒక సాధారణ ఇంజనీరింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. సాధారణంగా నావికులకు కంపెనీ షేర్లు లభించడం అరుదు. కానీ ఆమె తనకు లభించిన స్టాక్ ఆప్షన్లతో పాటు, ప్రతి నెలా తన జీతంలో 10 శాతాన్ని కంపెనీ షేర్లలోనే దాచుకున్నారు. నేడు ఐపీఓతో ఆమె ఓవర్‌నైట్ మిలియనీర్‌గా మారి, తన సొంత రిపేర్ బిజినెస్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. స్పేస్‌ఎక్స్‌.. దాదాపు పాతికేళ్ల కిందట స్టార్టప్‌గా మొదలైంది సంస్థ. తొలి రోజుల్లో కంపెనీలో చేరేందుకు కొందరు సందేహించారు. సంస్థ మనుగడ కష్టమేనని భావించారు. మధ్యలోనే మానేసి వెళ్లిపోయిన వారు కూడా ఉన్నారు. కానీ, కొందరు మాత్రం సంస్థను నమ్మి ఇన్నాళ్లూ కొనసాగుతున్నారు. అలాంటి వారిపై ఇప్పుడు కాసుల వర్షం కురవనుంది. మార్కెట్‌ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూకు స్పేస్‌ఎక్స్‌ సిద్ధమైంది. ఈ ఐపీఓ తో కంపెనీకి చెందిన దాదాపు 4,400 మంది ఉద్యోగులు మిలియనీర్లుగా మారబోతున్నారు. స్పేస్‌ఎక్స్‌ కంపెనీలో ప్రస్తుతం 22వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో కొంతమంది లాంచ్‌ సైట్ల దగ్గర, మరికొంతమంది ఇండస్ట్రియల్‌ కాంప్లెక్స్‌లో డ్యూటీ చేస్తున్నారు. ఇక, ఈ పాతికేళ్లలో కొన్ని వందల మంది రిటైర్మెంట్‌ లేదా రాజీనామా చేసి కంపెనీ నుంచి వెళ్లిపోయారు. కంపెనీ తమ ఉద్యోగులకు బోనస్‌గా కొన్ని షేర్లను కేటాయించింది. అప్పట్లో వాటి విలువ చాలా తక్కువ. ఇప్పుడు ఐపీఓకు వెళ్తుండటంతో ఉద్యోగులకు బంపరాఫర్‌ తగిలింది. 4,400 మందికి పైగా ప్రస్తుత, మాజీ ఉద్యోగులు ఈ ఐపీఓతో మిలియనీర్లు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఇన్వెస్ట్‌మెంట్‌ వేదిక హిల్‌ డాట్ కామ్‌ తెలిపింది. వీరిలో 400 మందికి ఏకంగా 100 మిలియన్‌ డాలర్లు అంటే దాదాపు రూ.956 కోట్ల కంటే ఎక్కువే అందుకుంటారని చెప్పింది. సాధారణంగా కంపెనీ ఐపీఓకు వెళ్తే దాని వ్యవస్థాపకులు, ఇతర వాటాదారులు సంపన్నులు కావడం చూస్తుంటాం. కానీ, ఈ స్థాయిలో ఉద్యోగులు కూడా మిలియనీర్లు కాబోతుండటం ఇదే తొలిసారి అని హిల్‌ డాట్‌ కామ్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది. గత 12 ఏళ్లుగా ఈ కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి దగ్గర ప్రస్తుతం లక్షకు పైగా షేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఐపీఓతో ఆయన షేర్ల విలువ 13.5 మిలియన్‌ డాలర్లు అంటే రూ.129 కోట్లకు పెరగనుంది. అయితే, ఈ కంపెనీ నుంచి వెళ్లిపోయిన కొందరు అప్పట్లో ఈ షేర్లు తమకు వద్దని అమ్మేశారట. మరికొందరు రెస్టారెంట్‌ గిఫ్ట్‌ కార్డులు, ఇతర చిన్న చిన్న అవసరాల కోసం వాటిని ట్రేడ్‌ చేసుకున్నారు. ఇప్పుడు వారంతా పశ్చాత్తాపపడుతుంటారని స్పేస్‌ఎక్స్‌ ఇతర ఉద్యోగులు చెబుతున్నారు. ఒకేసారి వేలాది మంది ఉద్యోగుల చేతికి బిలియన్ల కొద్దీ క్యాష్‌ రాబోతుండటంతో, వారి పెట్టుబడులను ప్లాన్ చేయడానికి పెద్ద పెద్ద ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సంస్థలు రంగంలోకి దిగాయి. మరోవైపు, ఈ కొత్త మిలియనీర్ల ధాటికి స్పేస్‌ఎక్స్ ప్రధాన కార్యకలాపాలు సాగుతున్న సౌత్ టెక్సాస్ బోకా చికా ప్రాంతంలో లగ్జరీ ఇళ్లకు, రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగినట్లు స్థానిక బ్రోకర్లు చెబుతున్నారు. స్పేస్‌ఎక్స్‌ ఐపీఓ జూన్‌ 12న ప్రారంభం కానుంది. ఒక్కో షేరు ఇష్యూ ధరను 135 డాలర్లుగా అంటే దాదాపు రూ.12వేలకు నిర్ణయించారు. ఈ ఐపీఓలో మొత్తం 55.56 కోట్ల షేర్లను అమ్మకానికి ఉంచనున్నారు. ఈ ఇష్యూ ద్వారా 75 బిలియన్‌ డాలర్లను కంపెనీ సమీకరించనుంది. 2019లో సౌదీ ఆరామ్‌కో సమీకరించిన 29.4 బిలియన్‌ డాలర్ల ఇష్యూనే ఇప్పటివరకు అతిపెద్దదిగా ఉంది. ఇపుడు స్పేస్‌ఎక్స్‌ అంతకు రెట్టింపుకు పైగా నిధులను మార్కెట్ల నుంచి తీసుకోనుంది. ఈ ఐపీఓతో కంపెనీ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ బిలియనీర్‌ హోదా నుంచి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఘనత సాధించే అవకాశం ఉంది. SpaceX సాధించిన ఈ అసాధారణ విజయం, రాబోయే రోజుల్లో స్టార్‌లింక్, AI మౌలిక సదుపాయాల విస్తరణకు మరింత ఊతాన్ని ఇవ్వనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వణికిస్తున్న ప్రాణాంతక ఈగ.. పశువుల మాంసాన్నే తింటూ విస్తరణ

అమెరికా నుంచి భారత్‌ కు అందుకే వచ్చా! అంబానీ కోడలు రాధిక ఏం చెప్పారో తెలుసా?

పోలీసుల నుంచి తప్పించుకోబోయి.. మొసలి నోటికి చిక్కాడు..

రండి బాబూ రండి.. ప్రభుత్వ స్కూల్లో చేరండి.. గ్రామాల బాట పట్టిన బడిపంతుళ్లు.. డప్పు కొడుతూ..

ఎద్దు స్థానంలో పొలం దున్నిన మహిళ.. ఆ తర్వాత!

Follow Us