Sreeleela: టాలీవుడ్‌లో గ్యాప్ వచ్చిందా? బాలీవుడ్‌లో జాన్వీతో కలిసి దూసుకెళ్తున్న శ్రీలీల!
టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో క్రేజ్ సంపాదించిన శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్తిక్ ఆర్యన్‌తో సినిమా చేస్తున్న ఆమె, జాన్వీ కపూర్‌తో కలిసి ఓ లేడీ ఓరియెంటెడ్ మల్టీస్టారర్‌లో నటించబోతున్నట్లు సమాచారం. ఉమేష్ బిస్త్ దర్శకత్వంలో ఏక్తా కపూర్, గునీత్ మోంగా నిర్మాణంలో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ తెరకెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో తగ్గిన అవకాశాలకు బదులుగా హిందీ, తమిళ చిత్రాలతో కెరీర్‌ను మరింత విస్తరించేందుకు శ్రీలీల ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
అవకాశాలు రానిచోట అనవసరంగా టైమ్ వేస్ట్ చేయడం కంటే.. ఆఫర్స్ ఉన్నచోటికి వెళ్లడం బెటర్ కాదు.. చూస్తుంటే శ్రీలీల ఇప్పుడిదే చేస్తున్నారేమో అనిపిస్తుంది. మూడేళ్ళ పాటు టాలీవుడ్‌ను డామినేట్ చేసిన ఈ బ్యూటీ చూపులిప్పుడు బాలీవుడ్‌పై పడ్డాయి. మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ అక్కడ వరస ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. తాజాగా మరో సినిమా సైన్ చేసారు శ్రీలీల. మరి అదేంటో తెలుసా..? శ్రీలీల చూపులన్నీ బాలీవుడ్‌పైనే ఉన్నాయిప్పుడు. ఆమెకు తోడు జాన్వీకపూర్ కూడా తోడయ్యారు. ఆల్రెడీ హిందీలో జాన్వీకి గుర్తింపు ఉంది.. ఆమెతో కలిసి శ్రీలీల కూడా బాలీవుడ్‌లో పాగా వేయాలని చూస్తున్నారు. ఇలా వేర్వేరు ఇండస్ట్రీల్లో స్టార్‌డమ్ ఎంజాయ్ చేస్తున్న ఈ భామలిద్దరూ కలిసి హిందీలో లేడీ ఓరియెంటెడ్ మల్టీస్టారర్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఉమేష్ బిస్త్ దర్శకత్వంలో ఏక్తా కపూర్, గునీత్ మోంగా నిర్మాతలుగా శ్రీలీల, జాన్వీ మల్టీస్టారర్ పట్టాలెక్కబోతోందని వార్తలొస్తున్నాయి. ఒకే అబ్బాయిని ఇష్టపడే ఇద్దరమ్మాయిల మధ్య జరిగే ఆసక్తికరమైన కథతో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఉత్కంఠభరితంగా సాగుతుందని తెలుస్తుంది. ఆల్రెడీ కార్తిక్ ఆర్యన్‌తో అదిరిపోయే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు శ్రీలీల. త్వరలోనే ఇది విడుదల కానుంది. తెలుగులో తప్ప మిగిలిన చోట్ల బిజీగా ఉన్నారు శ్రీలీల. తమిళంలో ధనుష్ జోడీగా ఓంతో పాటు అజిత్ సినిమాలోనూ నటిస్తున్నారని తెలుస్తుంది. హిందీలో కార్తిక్ ఆర్యన్ సినిమా సెట్స్‌పై ఉండగానే సైఫ్ అలీ ఖాన్ కొడుకుతో ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పుడు జాన్వీతో కలిసి మల్టీస్టారర్‌కు ఓకే చెప్పారు. మరి తెలుగులో చేసిన మ్యాజిక్కే.. శ్రీలీల హిందీలోనూ రిపీట్ చేస్తారా..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shraddha Srinath: మూడు భాషల్లో హిట్లు.. అయినా అవకాశాలు కరువు! శ్రద్ధా శ్రీనాథ్ కెరీర్‌కు ఏమైంది?
Ritika Nayak: వరుస హిట్లతో టాలీవుడ్‌లో గోల్డెన్ హ్యాండ్‌గా మారిన యంగ్ బ్యూటీ.. ఎవరో తెలుసా?
Dhurandhar: థియేటర్లలో వేల కోట్లు.. ఇప్పుడు ఓటీటీలోనూ వరల్డ్ రికార్డ్! ‘ధురంధర్’ దుమ్మురేపుతోంది
పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!
ఈ చిన్నారి చిచ్చరపిడుగు.. ఏకంగా విమానాన్నే రద్దు చేయించింది!
పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!
ఈ చిన్నారి చిచ్చరపిడుగు.. ఏకంగా విమానాన్నే రద్దు చేయించింది!
Gen Z ప్రేమలో వినిపించే ఈ డేటింగ్ పదాల అసలు అర్థాలివే!
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!

