AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసుల నుంచి తప్పించుకోబోయి.. మొసలి నోటికి చిక్కాడు..

పోలీసుల నుంచి తప్పించుకోబోయి.. మొసలి నోటికి చిక్కాడు..

Phani CH
|

Updated on: Jun 15, 2026 | 8:35 PM

Share

అమెరికాలో అరెస్టు నుంచి తప్పించుకోవాలని చెరువులోకి దూకిన వ్యక్తిపై మొసలి దాడి చేసిన ఘటన వైరల్‌గా మారింది. లూసియానాలో విక్టర్ రివాస్ అనే వ్యక్తి మద్యం మత్తులో కారు నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చెరువులోకి దిగగా మొసలి దాడి చేసి గాయపరిచింది. అనంతరం డ్రోన్ సాయంతో అతడిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించి మరింత పెద్ద ప్రమాదంలోకి జారుకున్నాడో వ్యక్తి. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు చెరువులోకి దూకిన అతడిపై ఓ మొసలి దాడి చేసింది. అమెరికాలో జరిగిన ఈ విచిత్ర ఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో విక్టర్‌ రివాస్‌ అనే 40 ఏళ్ల వ్యక్తి మద్యం మత్తులో కారు నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అతడు నడుపుతున్న టయోటా కారు రోడ్డుపక్కన ఉన్న కాంక్రీట్‌ డివైడర్‌ను ఢీకొట్టడంతో పాటు టైరు కూడా పేలిపోయింది. పోలీసులు ఆ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే రివాస్‌ కారును వదిలేసి కాలినడకన పారిపోయాడు. సమీపంలోని చెరువులోకి దూకి పోలీసులకు కనిపించకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కొంతసేపటి తర్వాత పోలీసులు అతడిని గుర్తించినా మళ్లీ చిత్తడి ప్రాంతంలోకి పరిగెత్తాడు. అప్పుడే ఊహించని ఘటన జరిగింది. నీటిలో ఉన్న ఓ మొసలి వేగంగా అతడి వైపు దూసుకొచ్చి దాడి చేసింది. దీంతో రివాస్‌ రెండు చేతులకు గాయాలయ్యాయి. అయినప్పటికీ అతడు అక్కడి నుంచి మళ్లీ పారిపోయేందుకు యత్నించాడు. చివరకు డ్రోన్‌ సాయంతో అతడి కదలికలను గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. గాయాల కారణంగా ముందుగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మద్యం మత్తులో వాహనం నడపడం, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడం ఇతర కేసులు నమోదు చేశారు. ‘‘మద్యం తాగి డ్రైవింగ్‌ చేయొద్దు.. పోలీసుల నుంచి పారిపోవొద్దు.. ముఖ్యంగా లూసియానా చెరువుల్లో దాక్కోవద్దు’’ అంటూ ఆ పోస్ట్‌ కి సరదా కామెంట్లు వచ్చాయి. స్థానిక పోలీసు స్టేషన్‌ కూడా మొసలి ఏఐ చిత్రాన్ని చూపిస్తూ నవ్వు తెప్పించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రండి బాబూ రండి.. ప్రభుత్వ స్కూల్లో చేరండి.. గ్రామాల బాట పట్టిన బడిపంతుళ్లు.. డప్పు కొడుతూ..

ఎద్దు స్థానంలో పొలం దున్నిన మహిళ.. ఆ తర్వాత!

బర్త్ డే రోజున కేక్ కొంటున్నారా.. అయ్యబాబోయ్‌..ఇది చూస్తే..

Follow Us