రండి బాబూ రండి.. ప్రభుత్వ స్కూల్లో చేరండి.. గ్రామాల బాట పట్టిన బడిపంతుళ్లు.. డప్పు కొడుతూ..
మహబూబాబాద్ జిల్లా పాటిమీదిగూడెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు వి. గోపినాథ్ విద్యార్థుల చేరికలు పెంచేందుకు వినూత్న ప్రచారం చేపట్టారు. డప్పు భుజాన వేసుకుని ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ బడుల ప్రాధాన్యతను వివరించారు. గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించి ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్పించాలని కోరారు. ఆయన కృషితో ఒకప్పుడు ముగ్గురు విద్యార్థులున్న పాఠశాల ఇప్పుడు 16 మంది విద్యార్థులతో కొనసాగుతోంది.
విద్యార్థులు లేని ప్రభుత్వ పాఠశాలలు మూతపడే ప్రమాదం పొంచి ఉండడంతో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు పడరాని పాట్లు పడుతున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకట్టుకోవడం కోసం వింత వేషాలు వేయక తప్పడం లేదు… మహబూబాబాద్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి డెడికేషన్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ బడిలో విద్యార్ధుల సంఖ్యను పెంచుకోడానికి.. ఏకంగా డప్పు భుజానికి వేసుకొని గ్రామాల బాటపట్టారు. డప్పు దరువేస్తూ పిల్లలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.”ప్రైవేట్ పాఠశాల వద్దు- ప్రభుత్వ బడి ముద్దు” అనే నినాదంతో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆయన కేవలం జీతం కోసం పనిచేసే సాధారణ బడి పంతులు కాదు.. ప్రభుత్వ స్కూళ్లను కాపాడుకోవాలనే తపన ఉన్న ఆదర్శ ఉపాధ్యాయుడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పాటిమీదిగూడెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు వి.గోపినాథ్ చేపట్టిన వినూత్న ప్రచార కార్యక్రమం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచడమే లక్ష్యంగా గోపీనాథ్ ఒక డప్పును భుజానికి వేసుకుని గ్రామంలోని ప్రతీ ఇంటికీ వెళ్లారు. స్వయంగా డప్పు దరువేస్తూ, ప్రభుత్వ బడుల్లో లభించే ఉచిత నాణ్యమైన విద్య, ప్రభుత్వం కల్పిస్తున్న వసతుల గురించి తల్లిదండ్రులకు వివరించారు. ప్రైవేట్ పాఠశాలలకు పంపి ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దని, ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని ఆత్మీయంగా విజ్ఞప్తి చేశారు. తన పిలుపుతో కదలివచ్చిన గ్రామస్తులందరినీ ఆయన గ్రామ బొడ్రాయి వద్దకు చేర్చారు. అక్కడ అందరితో.. “ఇకపై మా పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపించం.. ప్రభుత్వ బడిలోనే చదివించుకుంటాం” అంటూ సామూహికంగా ప్రతిజ్ఞ చేయించారు. మూడేళ్ల క్రితం కేవలం ముగ్గురు విద్యార్థులతో మూతపడే స్థితికి చేరిన ఈ పాఠశాల,ఇప్పుడు ఈయన శ్రమ వల్ల 16 మంది విద్యార్థులతో కళకళలాడుతోంది. కేవలం విధులకు పరిమితం కాకుండా, సమాజ శ్రేయస్సు కోసం డప్పు పట్టిన ఉపాధ్యాయుడిని చుట్టుపక్కల గ్రామ ప్రజలతో పాటు విద్యాశాఖ అధికారులు సైతం ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రండి బాబూ రండి.. ప్రభుత్వ స్కూల్లో చేరండి..
ఎద్దు స్థానంలో పొలం దున్నిన మహిళ.. ఆ తర్వాత!
బర్త్ డే రోజున కేక్ కొంటున్నారా.. అయ్యబాబోయ్..ఇది చూస్తే..
పట్టుతప్పి కిందపడ్డా.. చనిపోయేదాన్నే.. కానీ గైడ్ వల్ల బతికాను..
వైరల్ వీడియోలే వరుడికి విలన్లయ్యాయి.. షాక్ తిన్న పెళ్లి బృందం!
రైతులకు మేలు చేసే వయ్యారి భామ మళ్లీ దర్శనం..!
మగ తోడు ఉంటేనే పిల్లల్ని కనగలరా? మరి ఈ చేప సంగతేంటి?

