మహబూబాబాద్‌లోని ఇండియన్ బ్యాంక్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అసిస్టెంట్ మేనేజర్ రాజేష్ కస్టమర్లు కుదువపెట్టిన 700 గ్రాముల బంగారాన్ని చోరీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుమారు రూ.90 లక్షల విలువైన ఈ బంగారాన్ని దొంగలించి పరారయ్యాడు. ఇతర బ్యాంకు సిబ్బంది ప్రమేయంపై బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.