అమెరికా నుంచి భారత్ కు అందుకే వచ్చా! అంబానీ కోడలు రాధిక ఏం చెప్పారో తెలుసా?
న్యూయార్క్ యూనివర్సిటీలో చదివిన రాధికా అంబానీ, అమెరికాలో అవకాశాలు ఉన్నప్పటికీ భారత్‌కే తిరిగి రావాలని నిర్ణయించుకున్న కారణాలను వెల్లడించారు. దేశ ఆర్థిక వృద్ధి, రాజకీయ స్థిరత్వం, డిజిటల్ విప్లవంతో పాటు కుటుంబం, సమాజం వంటి ‘ఎమోషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ తన నిర్ణయంలో కీలక పాత్ర పోషించాయని చెప్పారు. దేశానికి సేవ చేయడం తన నైతిక బాధ్యతగా భావించినట్లు రాధికా పేర్కొన్నారు.
న్యూయార్క్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ చదివిన రాధికా అంబానీ, తాను భారత్‌కు తిరిగి వచ్చే నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారని, ఎన్నికల ప్రచారం, నిరసనలతో రాజకీయంగా తీవ్ర గందరగోళం నెలకొని ఉందని వివరించారు. ‘ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు ది యునైటెడ్ నేషన్స్’ కార్యక్రమంలో రాధికా అంబానీ ఈ విషయాలను తెలిపారు. అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించినప్పటికీ తన కెరీర్‌ను అక్కడ కాకుండా భారత్‌లో నిర్మించుకోవడానికి కారణాలను రాధికా అంబానీ వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం, రాజకీయ సుస్థిరత, కుటుంబ బాధ్యత వంటి అంశాలే తనను స్వదేశానికి తిరిగి వచ్చేలా చేశాయని ఆమె స్పష్టం చేశారు. ఆ సమయంలో భారతదేశంలో పరిస్థితులు పూర్తి భిన్నంగా, ఎంతో ఆశాజనకంగా ఉన్నాయని రాధికా తెలిపారు. బీజేపీకి బలమైన మెజారిటీ లభించడం, ఆధార్, యూపీఐ వంటి డిజిటల్ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడం, రిలయన్స్ జియో ప్రారంభం కావడం వంటి సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నాయని అన్నారు. ఆనాడు భారత ఆర్థిక వ్యవస్థ 8.5 శాతం వృద్ధి రేటుతో దూసుకెళ్తుండగా, అమెరికా వృద్ధి కేవలం 2-3 శాతంగానే ఉందని గుర్తుచేశారు. న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న సభకు హాజరవడం తనలో మరింత స్ఫూర్తిని నింపిందని, దేశ భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచిందని ఆమె చెప్పారు. కేవలం ఆర్థిక, రాజకీయ అంశాలే కాకుండా తను ‘ఎమోషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ అనే అంశానికి ఎక్కువ విలువ ఇస్తానని రాధికా అంబానీ ఒక కొత్త విషయాన్ని ప్రస్తావించారు. జీవితానికి భావోద్వేగ మౌలిక సదుపాయాలు కూడా ఉంటాయన్నారు. అవే మన తల్లిదండ్రులు, మనల్ని తీర్చిదిద్దిన సమాజం అన్నారు. కేవలం రోడ్లు, రైల్వేలు వంటి భౌతిక సదుపాయాల కన్నా కుటుంబం, సమాజం అండతో జీవితాన్ని నిర్మించుకోవడం ఎంతో విలువైన ఆస్తి అని వివరించారు. దేశం కోసం పనిచేయడం తన నైతిక బాధ్యత అని భావించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని 31 ఏళ్ల రాధికా స్పష్టం చేశారు. చదువు పూర్తయ్యాక తన కుటుంబానికి చెందిన ఎన్‌కోర్ హెల్త్‌కేర్ లో చేరిన ఆమె, అంబానీ కుటుంబ సంస్థల బాధ్యతలతో పాటు పలు సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. రాధికా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మారుతున్న భారతదేశంలో యువతకు లభిస్తున్న అవకాశాలు, దేశభక్తి వంటి అంశాలపై జరుగుతున్న చర్చకు ఆమె మాటలు మరింత బలాన్నిచ్చాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పోలీసుల నుంచి తప్పించుకోబోయి.. మొసలి నోటికి చిక్కాడు..
రండి బాబూ రండి.. ప్రభుత్వ స్కూల్లో చేరండి.. గ్రామాల బాట పట్టిన బడిపంతుళ్లు.. డప్పు కొడుతూ..
అమెరికా నుంచి భారత్ కు అందుకే వచ్చా!
పోలీసుల నుంచి తప్పించుకోబోయి.. మొసలి నోటికి చిక్కాడు..
రండి బాబూ రండి.. ప్రభుత్వ స్కూల్లో చేరండి..
ఎద్దు స్థానంలో పొలం దున్నిన మహిళ.. ఆ తర్వాత!
బర్త్ డే రోజున కేక్ కొంటున్నారా.. అయ్యబాబోయ్..ఇది చూస్తే..
పట్టుతప్పి కిందపడ్డా.. చనిపోయేదాన్నే.. కానీ గైడ్ వల్ల బతికాను..
వైరల్ వీడియోలే వరుడికి విలన్‌లయ్యాయి.. షాక్ తిన్న పెళ్లి బృందం!

