AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొలంలో పనులు చేసుకుంటున్న రైతు.. అకస్మాత్తుగా కనిపించిన అరుదైన దృశ్యం చూసి..

పొలంలో పనులు చేసుకుంటున్న రైతు.. అకస్మాత్తుగా కనిపించిన అరుదైన దృశ్యం చూసి..

Phani CH
|

Updated on: Jun 15, 2026 | 8:52 PM

Share

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చిన్నపాపయ్యపల్లె గ్రామంలో రెండు పాములు ఒకదానికొకటి పెనవేసుకుని సయ్యాటలాడిన అరుదైన దృశ్యం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. రైతు తనుగుల సంపత్ నారుమడిలో ఈ ఘటనను గమనించి వీడియో తీశారు. సుమారు 30 నిమిషాల పాటు సాగిన ఈ విన్యాసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, నిపుణులు దీనిని జతకట్టే ప్రక్రియ లేదా ఆధిపత్య పోరాటంగా పేర్కొంటున్నారు.

వానాకాలం ప్రారంభంతో ప్రకృతిలో చోటుచేసుకునే అరుదైన దృశ్యాలు అప్పుడప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. తాజాగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చిన్నపాపయ్యపల్లె గ్రామంలో నారుమడిలో రెండు పాములు సయ్యాటలాడుతూ కనిపించిన దృశ్యం స్థానికులను అబ్బురపరచడమే కాకుండా, సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. చిన్నపాపయ్యపల్లె గ్రామానికి చెందిన రైతు తనుగుల సంపత్ ఉదయాన్నే తన నారుమడికి నీరు పెట్టేందుకు వెళ్లగా, రెండు పాములు ఒకదానికొకటి పెనవేసుకుని గాలిలో నాట్యం చేస్తున్నట్లు కనిపించాయి. భూమి నుంచి పైకి లేస్తూ, మెలికలు తిరుగుతూ సాగిన ఆ విన్యాసం రైతుకు ఓవైపు భయం, మరోవైపు ఆశ్చర్యాన్ని కలిగించింది. నారుమడి మధ్యలో ప్రారంభమైన ఈ జంట నాగుల సయ్యాట క్రమంగా రోడ్డుపైకి చేరి దాదాపు పది అడుగుల మేర సాగింది. సుమారు 30 నిమిషాల పాటు చుట్టుపక్కల పరిస్థితులను పట్టించుకోకుండా ఆ రెండు పాములు తమ సహజ విన్యాసాన్ని ప్రదర్శించాయి. ఈ అరుదైన దృశ్యాన్ని రైతు సంపత్ తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించగా, ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. వన్యప్రాణి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వర్షాకాలం ప్రారంభంలో పాములు జతకట్టే సమయంలో లేదా ఆధిపత్య పోరాటంలో భాగంగా ఇలా ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయని, సాధారణ ప్రజలకు ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తాయని చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బలపడుతున్న రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల భారీ వర్ష సూచన

రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా.. 4,400 మంది సాధారణ ఉద్యోగులు!

వణికిస్తున్న ప్రాణాంతక ఈగ.. పశువుల మాంసాన్నే తింటూ విస్తరణ

అమెరికా నుంచి భారత్‌ కు అందుకే వచ్చా! అంబానీ కోడలు రాధిక ఏం చెప్పారో తెలుసా?

పోలీసుల నుంచి తప్పించుకోబోయి.. మొసలి నోటికి చిక్కాడు..

Follow Us