చనిపోయిన భార్యపై ప్రేమకు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ
నాగ్‌పూర్‌కు చెందిన రిటైర్డ్ బ్యాంకర్ శ్రీకాంత్ సహస్రబుద్ధే తన భార్యతో కలిసి ప్రపంచ యాత్ర చేయాలనే కల కోసం దాచుకున్న డబ్బులో రూ.25 లక్షలను భారత సైన్యానికి విరాళంగా అందించారు. భార్య మరణంతో చెదిరిపోయిన కలను స్ఫూర్తిదాయకమైన సేవగా మార్చిన ఆయన నిర్ణయం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. ప్రేమ, త్యాగం, దేశభక్తికి ఈ ఘటన ప్రతీకగా నిలిచింది.
నాగ్‌పూర్‌కు చెందిన ఒక రిటైర్డ్ బ్యాంకర్ భార్యపై చూపిన ప్రేమ అందరి హృదయాలను కదిలిస్తోంది. తన భార్యతో కలిసి ప్రపంచ యాత్ర చేయాలనుకున్నారు. ఆ కలను నెరవేర్చుకోవడానికి కొంత సొమ్ము దాచుకున్నారు. కానీ ఆమె చనిపోయింది. దీంతో యాత్ర కోసం దాచుకున్న మొత్తం నుంచి రూ. 25 లక్షలను భారత సైన్యానికి విరాళంగా ఇచ్చారు. వ్యక్తిగత విషాదాన్ని ఒక స్ఫూర్తిదాయక చర్యగా మార్చిన ఆయన కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీకాంత్ సహస్రబుద్ధే పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన భార్య కూడా అదే బ్యాంక్‌లో పనిచేసి పదవీ విరమణ పొందారు. తన భార్యతో కలిసి రిటైర్మెంట్ తర్వాత తమ పొదుపు, పీఎఫ్ డబ్బుతో ప్రపంచమంతా చుట్టి రావాలని ప్లాన్ వేసుకున్నారు. అయితే, పదేళ్ల క్రితం ఆయన భార్య అనారోగ్యంతో మరణించడంతో వారి కల చెదిరిపోయింది. ఆ విషయం గురించి శ్రీకాంత్ ఏమన్నారంటే.. తన భార్య, తను పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రిటైర్ అయ్యామనీ ఆమె చనిపోయాక, ఎక్కడిక ప్రయాణించాలనే కోరిక తనకు లేకుండా పోయిందని ఆవేదనతో చెప్పారు. ఇటీవల మహారాష్ట్రలోని అకోలాకు చెందిన ఒక వ్యక్తి రూ. కోటి విరాళం ఇచ్చినట్లు వాట్సాప్‌లో వచ్చిన సందేశం తనను ఆలోచింపజేసిందని శ్రీకాంత్ తెలిపారు. తన దగ్గర అంత సంపద లేదు కానీ తను రూ. 25 లక్షలు ఇవ్వగలను అనుకున్నాడు. తమ ప్రపంచయాత్ర కోసం దాచిన డబ్బులో సగం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాననీ తెలిపారు. బహుశా, తన భార్యతో కలిసి ప్రయాణిస్తే తనకు ఎంత ఆనందం లభించేదో, ఈ దానంతో అంతే సంతోషం దొరుకుతుందేమో అన్నారు. విరాళం ఇస్తున్నప్పుడు తన కన్నీళ్లు ఆగలేదని చెబుతూ శ్రీకాంత్ భావోద్వేగానికి గురయ్యారు. తన భార్యను తానెంతగా మిస్ అవుతున్నారో గుర్తుచేసుకున్నారు. శ్రీకాంత్ సహస్రబుద్ధే కథ సోషల్ మీడియాలో ఎందరినో కదిలించింది. “ఆయన గొప్ప మనిషి, సైన్యానికి విరాళం ఇవ్వాలన్న ఆయన నిర్ణయానికి సెల్యూట్” అని ఒకరు కామెంట్ చేయగా, “ఆయన మాటల్లో జీవితకాలపు ప్రేమ, నష్టం ఉన్నాయి. ఈ గొప్ప చర్యతో ఆయనకు ప్రశాంతత లభిస్తుందని ఆశిస్తున్నాను” అని మరొకరు రాశారు. చెదిరిన కలల బాధ ఉన్నా, స్ఫూర్తిని నింపాలనే ఆయన సంకల్పం గొప్పదని పలువురు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫేస్‌బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..
పొలంలో పనులు చేసుకుంటున్న రైతు.. అకస్మాత్తుగా కనిపించిన అరుదైన దృశ్యం చూసి..
బలపడుతున్న రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల భారీ వర్ష సూచన
రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా.. 4,400 మంది సాధారణ ఉద్యోగులు!
చనిపోయిన భార్యపై ప్రేమకు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ
ఫేస్‌బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..
పొలంలో పనులు చేసుకుంటున్న రైతు.. కనిపించిన అరుదైన దృశ్యం చూసి
రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా.. 4,400 మంది సాధారణ ఉద్యోగులు!
వణికిస్తున్న ప్రాణాంతక ఈగ.. పశువుల మాంసాన్నే తింటూ విస్తరణ
అమెరికా నుంచి భారత్ కు అందుకే వచ్చా!
పోలీసుల నుంచి తప్పించుకోబోయి.. మొసలి నోటికి చిక్కాడు..

