AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది.. దేశవ్యాప్తంగా రగిలిన వివాదం!

ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది.. దేశవ్యాప్తంగా రగిలిన వివాదం!

Phani CH
|

Updated on: Jun 15, 2026 | 9:08 PM

Share

గురుగ్రామ్‌లో జరిగిన ఓ స్టాండప్ కామెడీ షోలో మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలతో ఓ టెకీ ఉద్యోగం కోల్పోయాడు. "బిర్యానీ కొంటే చాలు" అంటూ చేసిన అసభ్యకర వ్యాఖ్య సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. నెటిజన్ల ఆగ్రహం నేపథ్యంలో టెకీతో పాటు కామెడియన్ కూడా క్షమాపణలు చెప్పారు. ఈ ఘటన మహిళల భద్రత, కన్సెంట్, కామెడీ హద్దులపై దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది.

ఏఐ కాలంలో ఉద్యోగం కాపాడుకోవడం ఎంత కష్టమో సోషల్ మీడియాలో ప్రతిరోజూ చూస్తున్నాం. అలాంటిది ఓ యువకుడు తన నోటి దురుసుతో ఉద్యోగాన్ని కోల్పోయాడు. “రూ.370 పెట్టి బిర్యానీ కొనిస్తే చాలు అమ్మాయిలు పడుకోడానికి వస్తారు” అంటూ అతను చేసిన కామెంట్ నెట్టింట్లో దుమారం రేపుతోంది. అమ్మాయిలకు ఒక బిర్యానీ కొనిస్తే చాలు పైసా వసూల్ కింద వారితో పడుకోవచ్చు అంటూ గురుగ్రామ్‌లో ఓ స్టాండప్ కమెడియన్ షోలో మహిళలను కించపరిచేలా మాట్లాడిన టెకీ పై ఆగ్రహం పెరుగుతోంది. స్టాండప్ కామెడియన్, బిగ్ బాస్ ఫేమ్ ప్రణీత్ మోరే లైవ్ షోలో ఓ టెకీ అసభ్యకరంగా నవ్వుతూ వ్యాఖ్యానించాడు. సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఆ వ్యాఖ్యలను ఖండించాల్సింది పోయి, కమెడియన్ ప్రణీత్ మోరేతో సహా అక్కడున్న వారంతా పగలబడి నవ్వుతూ.. దానిని “పీక్ గురుగ్రామ్ కంటెంట్” అని ప్రోత్సహించడమే కాకుండా, యువకుడికి వేదికపైనే ఒక బహుమతి కూడా ఇవ్వడం తీవ్ర వివాదానికి దారితీసింది. మహిళల కన్సెంట్ తో సంబంధం లేకుండా ప్రవర్తించే వికృత మానసిక స్థితిని సామాజిక కార్యకర్తలు, సెలబ్రిటీలు తప్పుబట్టారు. హిమాన్షు జంగ్రా తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. నెటిజన్ల ట్రోలింగ్ ను భరించలేక కమెడియన్ ప్రణీత్ మోర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డియాక్టివేట్ చేసుకున్నాడు. పరిస్థితి చేదాటిపోవడంతో తప్పు తెలుసుకున్న ఇద్దరూ ఆ తర్వాత బహిరంగంగా క్షమాపణలు చెబుతూ వీడియోలను విడుదల చేశారు. ఈ ఘటన కేవలం ఒక కామెడీ షో వివాదంగా మిగిలిపోకుండా, ప్రస్తుత సమాజంలో డేటింగ్ సంస్కృతి, మహిళల భద్రత, కామెడీ పేరుతో ప్రదర్శిస్తున్న వికృత మెంటాలిటీపై దేశవ్యాప్తంగా లోతైన చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఎక్స్ ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో హాష్‌టాగ్‌ BiryaniIIsNotConsent ట్రెండ్ అవుతోంది. హాస్యం అనేది ఇతరులను నవ్వించేలా ఉండాలి కానీ, ఒకరి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉండకూడదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. యువతులు ఎవ్వరి మీద ఆధారపడకుండా బతకాలని, ఆర్థిక స్వతంత్రులుగా ఎదగాలని , ఎవరైనా తమ మీద ఖర్చు పెడుతుంటే వారి మనసులో అలాంటి వికృత ఆలోచనలు ఎక్కడో ఒక మూల ఉంటాయని గమనించాలని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోజుకు 200 లీటర్లే.. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు

హైదరాబాద్ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ షేర్లు కొనొచ్చా?

చ‌నిపోయిన భార్య‌పై ప్రేమ‌కు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ

ఫేస్‌బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..

పొలంలో పనులు చేసుకుంటున్న రైతు.. అకస్మాత్తుగా కనిపించిన అరుదైన దృశ్యం చూసి..

Follow Us