క్లీనర్, కార్ వాషర్‌గా చిన్నా చితకా పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
ఆస్ట్రేలియాలో చదువుకుంటూ ఆఫీసులు శుభ్రం చేయడం, కార్లు కడగడం వంటి చిన్న చిన్న పనులు చేసిన భారతీయ యువకుడు దేవెన్ నేడు సైబర్ సెక్యూరిటీ రంగంలో విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకున్నాడు. తన కష్టంతో టెస్లా కారును, మిలియన్ డాలర్ల విలువైన ఇంటిని సొంతం చేసుకున్నాడు. అతని స్ఫూర్తిదాయక ప్రయాణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి యువతకు ప్రేరణగా నిలుస్తోంది.
పట్టుదల ఉంటే విజయం ఎప్పటికైనా వరిస్తుందని ఓ ప్రవాస భారతీయుడు నిరూపించాడు. ఒకప్పుడు ఆస్ట్రేలియాలో పొట్టకూటి కోసం ఆఫీసులను శుభ్రం చేస్తూ, కార్లు కడిగిన ఆ యువకుడు, నేడు టెస్లా కారుతో పాటు మిలియన్ డాలర్ల విలువైన ఇంటిని సొంతం చేసుకున్నాడు. తన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో అతను పంచుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దేవెన్ అనే భారతీయ యువకుడు 2011లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ, భారత్‌లో సరైన ఉద్యోగం లభించక ఇబ్బందులు పడ్డాడు. కుటుంబం అండగా ఉన్నప్పటికీ, వారిపై ఆధారపడటం ఇష్టం లేక 2012లో ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ చదువుకుంటూనే తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో కిచెన్ హెల్పర్, ఆఫీస్ క్లీనర్, కార్ వాషర్ వంటి పనులు చేశాడు. చదువు పూర్తయిన తర్వాత సరైన అవకాశం కోసం వేచి చూసిన దేవెన్‌కు, 2016లో సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉద్యోగం లభించింది. ఇక అప్పటి నుంచి అతను వెనుదిరిగి చూడలేదు. 2017 నుంచి 2022 మధ్య కాలంలో కెరీర్‌లో స్థిరంగా ఎదుగుతూ ఆర్థికంగా పటిష్టమైన స్థితికి చేరుకున్నాడు. తన కష్టార్జితంతో 2023లో టెస్లా కారును, 2024లో మిలియన్ డాలర్ల విలువైన గృహాన్ని కొనుగోలు చేశాడు. తన జీవన ప్రస్థానాన్ని వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో అతడు పోస్టు చేసిన వీడియోకు నెటిజన్ల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. “పట్టుదలకు, నిరంతర కృషికి ఇది నిదర్శనం” అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం దేవెన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పెట్టుబడులు, సంపద సృష్టి వంటి అంశాలపై నెటిజన్లకు విలువైన సమాచారాన్ని అందిస్తున్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
క్లీనర్, కార్ వాషర్‌గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..
చనిపోయిన భార్యపై ప్రేమకు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ
ఫేస్బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..
పొలంలో పనులు చేసుకుంటున్న రైతు.. కనిపించిన అరుదైన దృశ్యం చూసి

