AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమ చేసిన హత్య? పాపం! సంచిత!

ప్రేమ చేసిన హత్య? పాపం! సంచిత!

Phani CH
|

Updated on: Jun 17, 2026 | 4:24 PM

Share

Sanchita Ugale ఆకస్మిక మరణం టెలివిజన్ రంగాన్ని విషాదంలో ముంచింది. ముంబైలోని తన నివాసంలో ఆమె మృతదేహం లభించగా, వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలు, మానసిక ఒత్తిడి కారణమై ఉండొచ్చని సహనటులు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు ప్రేమ వ్యవహారం సహా పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తూ, మరణానికి గల అసలు కారణాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.

సంచితా ఉగాలే! బుల్లి తెరపై తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ఉన్నట్టుండి బలవన్మరణానికి పాల్పడ్డారు. ముంబైలోని తన ఇంట్లో విగతజీవిగా పడిఉన్నారు. అయితే సంచిత మరణానికి తన మాజీ ప్రియుడితో ఉన్న వ్యక్తిగతకారణాలే కారణం కావచ్చిన తన కో యాక్టర్స్‌ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రేమ వ్యవహారానికితోడు మానసిక ఒత్తిడి కూడా… ఈమెను ఆత్మహత్య చేసుకోడానికి ప్రేరేపి ఉండొచ్చని పోలీసులు బలంగా బావిస్తున్నారు. గతంలో సంచిన తన కో స్టార్ ఉజ్వల్ శర్మతో ప్రేమలో ఉన్నట్టుగా ఓ న్యూస్‌ వైరల్ అయింది. అయితే అప్పట్లోనే ఈ న్యూస్‌ పై ఉజ్వల్ రియాక్టయ్యాడు. సంచిత తో తనకు ఎలాంటి రిలేషన్ లేదని.. ఆమె మరో అబ్బాయితో ప్రేమలో ఉందని రివీల్ చేశాడు. సంచిత సూసైడ్ తర్వాత కూడా మీడియాతో మాట్లాడిన ఉజ్వల్.. కీలక విషయాలు వెల్లడించాడు. సంచిత తన ప్రియుడితో ఇన్నాళ్లూ లివ్ ఇన్ రిలేషన్‌లో ఉండేదని.. అయితే కొన్ని రోజులుగా ముందు వాళ్ల బ్రేకప్ జరిగిందని.. అప్పటి నుంచి ఆమె తీవ్రమైన మానసిక ఇబ్బందులను, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొందని ఉజ్వల్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు లవ్ బ్రేకప్‌ వల్ల సంచిత తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లారని.. ఆమె : వ్యక్తిగత మరియు ప్రేమ జీవితంలో వచ్చిన సమస్యల వల్ల ఆమె తీవ్రమైన డిప్రెషన్‌కు లోనయ్యారు. ఆమె మానసిక స్థితిని గమనించిన సదరు సీరియల్ ప్రొడక్షన్ హౌస్ వారు కూడా ఆమెకు కౌన్సెలింగ్, చికిత్స అందించడంలో సహాయపడ్డారని కొందరు సహనటులు తెలిపారు. సంచితా కజిన్ బ్రదర్ ఆకాష్ ఉగాలే మీడియాతో మాట్లాడుతూ సంచిత మరణాన్ని సుశాంత్ సింగ్ మరణంతో పోల్చాడు. ఆమె తీవ్రమైన ఒత్తిడిలో ఉందని, కాస్టింగ్ సర్క్యూట్ లేదా పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తుల నుంచి కూడా ఆమె మానసిక వేధింపులు ఎదుర్కొని ఉండవచ్చని ఆరోపించాడు. అయితే వీరందరి స్టేట్మెంట్స్‌ను పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. సంచితా ఆత్మహత్యకు గల కారణాలపై ప్రేమ వ్యవహారం కోణంతో పాటు అన్ని రకాల కోణాల్లోనూ లోతుగా విచారణ జరుపుతున్నామని అధికారికంగా ప్రకటించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిగ్ బాస్‌ 10 ఫస్ట్ కంటెస్టెంట్‌గా.. సీరియల్ బ్యూటీ ఫిక్స్?

వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు బాబూ.. బ్రతకాలని లేదా నీకు!

అస్థిపంజరాలు చెప్పిన లక్షల ఏళ్ల నాటి రహస్యం..

Follow Us