కార్పొరేట్ లుక్‌లో సర్కారు బడులు.. విద్యార్థులకు సరికొత్త యూనిఫాంలు..
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సరికొత్త యూనిఫాంలు, బూట్లు, సాక్సులు, బెల్టులతో కూడిన ప్రత్యేక కిట్లను అందిస్తోంది. మొత్తం 27 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల కొత్త డ్రెస్సులు పంపిణీ చేయనుంది. గురుకుల, ప్రభుత్వ పాఠశాలల కోసం ప్రత్యేక డిజైన్లు రూపొందించగా, మహిళా సంఘాలు, చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం సరికొత్త థ్రిల్‌ను ఇవ్వబోతోంది. ఎందుకంటే, ఎప్పటి నుంచో ఉన్న పాత రెడ్ యాష్ కలర్ డ్రెస్సులకు ప్రభుత్వం గుడ్-బై చెప్పేసింది. వాటి స్థానంలో ట్రెండీగా ఉండే సరికొత్త రంగులను, అదిరిపోయే కిట్లను ప్రవేశపెట్టింది. ఇకపై ప్రభుత్వ స్కూల్ పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్స్ తరహాలోనే ఫుల్ జోష్‌తో క్లాస్ రూమ్‌లోకి అడుగుపెట్టనున్నారు. మొత్తం 27 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల సరికొత్త యూనిఫాంలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. ఈసారి రెండు కేటగిరీలుగా డిజైన్లను మార్చారు. సాధారణ పాఠశాలల అబ్బాయిల షర్టులు, అమ్మాయిల టాప్స్ అన్నీ క్లాసీగా ఉండే లైట్ బ్లూ రంగులోకి మారాయి. అలాగే అబ్బాయిల ప్యాంట్లు, అమ్మాయిల బాటమ్స్ ముదురు నీలం రంగులో ఉంటాయి. ఇక గురుకుల పాఠశాల విద్యార్థులకు మెరూన్ చెక్స్ టాప్, దానికి మ్యాచ్ అయ్యేలా ప్లెయిన్ మెరూన్ లోవర్స్‌ను కేటాయించారు. అలాగే, ఇకపై 6, 7 తరగతులు చదివే అబ్బాయిలకు కూడా ప్యాంట్లు తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. దుస్తులు ఎక్కువ కాలం మన్నేలా ప్రముఖ ‘మఫత్‌లాల్’ సంస్థ నుండి 2.41 కోట్ల మీటర్లు, తెలంగాణ చేనేత సంస్థ నుంచి 55.32 లక్షల మీటర్ల నాణ్యమైన వస్త్రాన్ని సేకరించారు. అంతేకాదు, ప్రభుత్వ పాఠశాలల చరిత్రలోనే తొలిసారిగా విద్యార్థులకు యూనిఫాంతో పాటు బూట్లు, సాక్సులు, బెల్టులను కూడా ఇస్తున్నారు. ఇక గురుకుల విద్యార్థులకైతే బ్యాగు, టై, బెడ్డింగ్, ప్లేటు, గ్లాసులతో కూడిన గ్రాండ్ కిట్ అందిస్తున్నారు.ఇవే కాకుండా, చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా 2 లక్షల మంది ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు కూడా కాలేజీ బ్యాగు, బెల్టు, టై, బూట్లు, సాక్సులను పంపిణీ చేస్తుండటం విశేషం. ఈ యూనిఫాంల కుట్టు పనిని పూర్తిగా మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. ఒక్కో యూనిఫాంకు రూ. 75 చొప్పున కూలి అందిస్తుండటంతో రాష్ట్రంలోని మహిళా సంఘాలకు ఏకంగా రూ. 40 కోట్లకు పైగా ఆదాయం సమకూరనుంది. అలాగే స్థానిక చేనేత కార్మికులకు 25 నుంచి 30 శాతం ఆర్డర్లు కేటాయించి 6.49 లక్షల దుప్పట్లు, 3 లక్షల బెడ్‌షీట్లు, 2.29 లక్షల కార్పెట్లు తయారు చేయిస్తున్నారు. టైలు, బెల్టులు, ఐడీ కార్డుల బాధ్యతను లెదర్ ఇండస్ట్రీస్‌కి అప్పగించి కార్మికులను ఆదుకున్నారు. గతంలో జరిగిన అవకతవకలకు తావులేకుండా, సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా తెచ్చిన ‘సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ సిస్టమ్’ ద్వారా విద్యా సంవత్సరం తొలి వారంలోనే ఈ పంపిణీని పూర్తి చేయనున్నారు. కొత్త డ్రెస్సులు, కొత్త బూట్లతో స్కూళ్లకు వెళ్లేందుకు విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Brazil : ప్రాణం తీసిన బంగీజంప్.. ఏం జరిగిందంటే..
అల్లు అర్జున్ ఎఫెక్ట్.. AA23 థీమ్ మ్యూజిక్‌ను ఉపయోగించిన.. ప్రధాని నరేంద్ర మోడి
ఈ వారం ఓటీటీల్లో 14 సినిమాలు.. ఆ మూవీని మాత్రం డోంట్ మిస్!
మన హీరోలకు బేసిక్ సినిమా నాలెడ్జ్ లేదు
సినిమాల తర్వాత ప్రజాసేవే లక్ష్యం.. రాజకీయాల్లోకి మరో తమిళ స్టార్
ప్రాణం తీసిన బంగీజంప్.. ఏం జరిగిందంటే..
వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు బాబూ..బ్రతకాలని లేదా నీకు!
అస్థిపంజరాలు చెప్పిన లక్షల ఏళ్ల నాటి రహస్యం..
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?
క్లీనర్, కార్ వాషర్గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు

