AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sridevi Biopic: అతిలోకసుందరి బయోపిక్‌లో ప్రియాంక ??

Sridevi Biopic: అతిలోకసుందరి బయోపిక్‌లో ప్రియాంక ??

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Aug 16, 2026 | 8:18 PM

Share

అతిలోక సుందరి శ్రీదేవి జీవితంపై తెరకెక్కనున్న బయోపిక్‌పై ఆసక్తికర చర్చ మొదలైంది. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎంప్రెస్’ పేరుతో బయోగ్రఫీ పుస్తకం రాబోతోంది. ప్రియాంక చోప్రా ఈ పుస్తక కవర్‌ను లాంచ్ చేయడంతో, భవిష్యత్తులో శ్రీదేవి బయోపిక్‌లో ఆమె నటిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. దాదాపు పదేళ్ల పరిశోధనతో రూపొందించిన ఈ పుస్తకం 2026 చివర్లో విడుదల కానుంది. అయితే బయోపిక్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు.

అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్ త్వరలో రాబోతుందా.. అందులో ఓ గ్లోబల్ స్టార్ నటించబోతుందా..? ఇండస్ట్రీలో ఈ వార్తలిప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమె జీవిత చరిత్ర ఆధారంగా రాసిన బుక్ కవర్ పేజీ లాంచ్‌తో ఈ చర్చ మొదలైంది. మరి దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన ఈ పాన్ ఇండియా లేడీ సూపర్ స్టార్ బయోపిక్ నిజంగానే వస్తుందా..? ఇండియన్ సినిమా చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని రీతిలో స్టార్‌డమ్ సంపాదించుకున్న శ్రీదేవి జీవితం ఆధారంగా ‘ఎంప్రెస్’ అనే బయోగ్రఫీ బుక్ రాబోతోంది. ధీరజ్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రాసిన ఈ బుక్ కవర్ పేజీని ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో లాంచ్ చేశారు. వెస్ట్‌ల్యాండ్ బుక్స్ పబ్లిష్ చేస్తున్న ఈ బయోగ్రఫీని 2026 చివర్లో అధికారికంగా విడుదల చేయనున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి 5 దశాబ్దాల పాటు సుమారు 300 సినిమాల్లో నటించి ఇండియాలోనే తొలి పాన్ ఇండియా ఫీమేల్ సూపర్ స్టార్‌గా ఎదిగారు శ్రీదేవి. ఎన్నో అద్భుతమైన సినిమాలతో.. హీరోలనే డామినేట్ చేసారు. అలాంటి మహానటి జీవితంలోని ఎన్నో తెలియని విషయాలను దాదాపు పదేళ్ల పాటు రీసెర్చ్ చేసి మరీ ఈ పుస్తకంలో అక్షర రూపంలో పొందుపరిచారు. శ్రీదేవితో తనకు ఉన్న వ్యక్తిగత పరిచయంతో ఆమె ప్రయాణాన్ని 5 భాషల్లో డాక్యుమెంట్ చేయడం తనకు దక్కిన అరుదైన అవకాశంగా రచయిత ధీరజ్ పేర్కొన్నారు. కోట్లాది మంది హృదయాల్ని ఏలిన గొప్ప నటి జీవితాన్ని ఈ బయోగ్రఫీతో కళ్లకు కట్టబోతున్నట్లు చూపించబోతున్నారు. అయితే బయోగ్రఫీ వరకేనా.. బయోపిక్ కూడా వస్తుందా అనే ఆసక్తి మాత్రం అలాగే ఉండిపోయింది. ఒకవేళ శ్రీదేవి బయోపిక్ చేస్తే.. అందులో ప్రియాంక చోప్రా నటిస్తారేమో అనే ప్రచారం జరుగుతుంది. ఆమె బయోగ్రఫీని ప్రియాంక స్వయంగా లాంచ్ చేయడంతో ఈ అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతానికి పుస్తక రూపంలోనే వస్తున్నా.. భవిష్యత్తులో ఇదే కథ వెండితెరపై బయోపిక్‌గా వచ్చి అందులో ప్రియాంక నటించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తుపాకులు వదిలి ర్యాంప్‌పైకి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు..

ఆధార్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు

ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వారి వల్ల కాలేదు.. చివరికి ఇలా..!

ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు!

మీ ఇంట సిరులు కురిపించే మొక్క! ఈ రోజులు, దిశలో నాటాలి గుర్తుంచుకోండి

Follow Us