ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వారి వల్ల కాలేదు.. చివరికి ఇలా..!
హైదరాబాద్ మియాపూర్‌లో ముగ్గురు దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి నగదు దోచుకునేందుకు విఫలయత్నం చేశారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎంను రాడ్లు, రాళ్లతో పగులగొట్టినా క్యాష్ బాక్స్ తెరుచుకోలేదు. దీంతో అక్కడి బ్యాకప్ బ్యాటరీలను ఎత్తుకెళ్లారు. సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంజీవ్ జాదవ్, రాపాక సూర్య ప్రకాశ్ రావులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు వాదిత్య కార్తిక్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలింపు కొనసాగుతోంది.
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఏటీఎంను లూటీ చేయడానికి దుండగులు విఫల యత్నం చేశారు. మియాపూర్ ఎక్స్ రోడ్డులోని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎంను టార్గెట్ చేసిన ముగ్గురు వ్యక్తుల ముఠా, రాడ్లు మరియు రాళ్లతో యంత్రాన్ని ధ్వంసం చేసి నగదు దోచుకునేందుకు యత్నించింది. కానీ వారు ఎంత ప్రయత్నించినా క్యాష్ బాక్స్ ఓపెన్ కాలేదు. వారి ప్రయత్నం బెడిసికొట్టడంతో చేసేది లేక దొంగలు అక్కడ ఉన్న బ్యాకప్ బ్యాటరీలను ఎత్తుకొని పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తెల్లవారుజామున ఏటీఎం వద్దకు చేరుకున్న నిందితులు పక్కా ప్లాన్‌తో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఒకరు బయట కాపలాగా ఉండగా, మరో ఇద్దరు లోపలికి వెళ్లి ఇనుప రాడ్లతో ఏటీఎంను పగులగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు, సీసీటీవీ పుటేజ్ ఆధారంగా ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నిందితులు సంజీవ్ జాదవ్, రాపాక సూర్య ప్రకాశ్ రావులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు వాదిత్య కార్తిక్ పరారీలో ఉన్నాడు. సులభంగా డబ్బు కొట్టేయాలనే దుర్బుద్ధితోనే వీరు ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితుల నుంచి ఒక ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఏటీఎంల భద్రత పట్ల బ్యాంకులు మరింత అప్రమత్తంగా ఉండాలని, తగిన వెలుతురుతో పాటు అలారం వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు!
మీ ఇంట సిరులు కురిపించే మొక్క! ఈ రోజులు, దిశలో నాటాలి గుర్తుంచుకోండి
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? అయితే ఈ డేంజర్ బెల్స్ మోగినట్టే!
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు.. ఈ ఊరిలో కన్నీటిని మరిపించే అద్భుతం!
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..
స్పోర్ట్స్ బ్యాగు తెరిచిన యువకుడు.. లోపలున్నది చూసి పరుగో పరుగు!

