AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తుపాకులు వదిలి ర్యాంప్‌పైకి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు..

తుపాకులు వదిలి ర్యాంప్‌పైకి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు..

Phani CH
|

Updated on: Aug 16, 2026 | 5:22 PM

Share

ఒకప్పుడు అడవుల్లో తుపాకులు పట్టిన మాజీ మహిళా నక్సలైట్లు ఇప్పుడు చేనేత చీరలు ధరించి ఫ్యాషన్ ర్యాంప్‌పై ఆత్మవిశ్వాసంతో క్యాట్‌వాక్ చేశారు. రాయ్‌పూర్‌లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ నక్సలైట్లను సీఎం విష్ణు దేవ్ సాయ్ అభినందించారు. బస్తర్‌లో నక్సలిజం తగ్గుముఖం పట్టడంతో పునరావాసం, అభివృద్ధి, కనెక్టివిటీపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.

ఒకప్పుడు దట్టమైన అడవుల్లో తుపాకులు చేతబట్టి తిరిగిన చేతులు.. ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఫ్యాషన్ ర్యాంప్‌పై అడుగులేశాయి. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో ఘనంగా జరిగిన జాతీయ చేనేత దినోత్సవం ఈ అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. జనజీవన స్రవంతిలో కలిసేందుకు ఆయుధాలను విడిచిపెట్టిన మాజీ మహిళా నక్సలైట్లు, అందమైన చేనేత చీరలు ధరించి ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేశారు. వారి ముఖాల్లోని చిరునవ్వులు, నడకలోని ధీమాను చూసి సభికులు మంత్రముగ్ధులై చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి సీఎం విష్ణు దేవ్ సాయ్ హాజరై వారిని అభినందించారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మావోయిస్టుల హింసతో అట్టుడికిన బస్తర్ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా నక్సల్ రహితంగా మారిందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అక్కడ అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవలే సీఎం విష్ణు దేవ్ సాయ్, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ.. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి బస్తర్ అభివృద్ధికి ప్రత్యేక రాయితీలు కల్పించాలని కోరారు. సుమారు 40-50 ఏళ్ల తర్వాత బస్తర్ ప్రశాంతంగా మారిందని, ముఖ్యంగా కనెక్టివిటీని మెరుగుపరచాల్సి ఉందని సీఎం వెల్లడించారు. ఒకప్పుడు దేశ అంతర్గత భద్రతకు పెను సవాల్‌గా నిలిచిన బస్తర్.. మావోయిస్టులకు వ్యూహాత్మక కేంద్రంగా ఉండేది. అయితే, ‘ఆపరేషన్ కగర్’ వంటి ప్రత్యేక ఆపరేషన్లతో భద్రతా బలగాలు మావోయిస్టుల వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయి. ప్రభుత్వ పునరావాస కార్యక్రమాలతో భారీ సంఖ్యలో నక్సలైట్లు లొంగిపోయారు. గత మే నెలలో బస్తర్‌ను సందర్శించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఈ ప్రాంతం పూర్తిగా నక్సల్ రహితంగా మారిందని ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో భద్రత నుంచి అభివృద్ధి దిశగా ఈ ప్రాంతాన్ని నడిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సానుకూల పరిణామాలన్నీ బస్తర్‌లో సరికొత్త శకానికి నాంది పలుకుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆధార్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు

ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వారి వల్ల కాలేదు.. చివరికి ఇలా..!

ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు!

మీ ఇంట సిరులు కురిపించే మొక్క! ఈ రోజులు, దిశలో నాటాలి గుర్తుంచుకోండి

వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!

Follow Us